అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ వారసత్వ కట్టడంగా లేపాక్షి..! యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు, అడుగు దూరంలో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక కట్టడం లేపాక్షికి మరో అరుదైన గుర్తింపు లభించింది. శిల్పకళకు, వర్ణచిత్రాలకు నిలయమైన లేపాక్షికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో గుర్తింపు లభించింది. లేపాక్షికి యునెస్కో గుర్తింపు రావటం గొప్ప పరిణామమని అఖిల భారత పంచాయతీ పరిషత్(ఢిల్లీ)జాతీయ కార్యదర్శి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు.

యునెస్కో హెరిటేజ్ జాబితాలోకి లేపాక్షి ఆలయం

యునెస్కో హెరిటేజ్ జాబితాలోకి లేపాక్షి ఆలయం

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 129 కట్టడాలలో ఒక్క దానిని కూడా యునెస్కో గురించకపోవడం శోచనీయమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదపైన దృష్టి సాధించలేదన్నారు. ఇటీవల రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ డాక్టర్ జీ వాణి మోహన్(ఐఏఎస్).. కేంద్రం పురావస్తు శాఖ అమరావతి సర్కిల్‌కు రికమాండ్ చేయడం శుభపరిణామమని అన్నారు. యునెస్కో వారు మొత్తం భారతదేశంలో నలభై ప్రపంచ వారసత్వ కట్టడాలను ఇప్పటికి గుర్తించగా లేపాక్షి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని పేర్కొన్నారు. దక్షిణాది అంతా కలిపినా కనీసం ఐదుకు మించి ఆ జాబితాలో లేవన్నారు.

చారిత్రక అద్భుత కట్టడం లేపాక్షి ఆలయం

చారిత్రక అద్భుత కట్టడం లేపాక్షి ఆలయం

2017 నుంచి కేంద్ర ప్రభుత్వంకు, డీజీ, కేంద్ర పురావస్తు శాఖ కార్యాలయంలో ఢిల్లీ అనేక పర్యాయాలు వెళ్లి వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలో స్పందించిన కేంద్రం, కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన కట్టడం లేపాక్షి, తదితర చారిత్రక కట్టడాలు సమాచారం అమరావతి సర్కిల్ అధికారులు సమాచారం ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపటం శుభపరిణామం .రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఘనమైన చరిత్ర కలిగి లేపాక్షి ఆలయం

ఘనమైన చరిత్ర కలిగి లేపాక్షి ఆలయం


ఇప్పటికైనా యునెస్కో, పురావస్తు శాఖావారు ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం, అతిపెద్ద ఏడు పడగల నాగేంద్రుడు, 856 స్థూపాల ఆలయం, 12 ధ్వజ స్తంభాలతో కూడిన నాట్యం మండపం, ఏ ఆధారం లేకుండా వేలాడే ధ్వజస్తంభం, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన శిల్పకళ, చిత్రాలకు నిలయమైన" లేపాక్షి "ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావటం లేపాక్షికి ఉన్న ఘనమైన చరిత్ర. ఢిల్లీలోని కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ వి విద్యావతి(IAS)కి, యునెస్కో డీజీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డికి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావుకి, డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫైనల్ జాబితాలో కూడా లేపాక్షి ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. తుది జాబితాలోనూ లేపాక్షి ఆలయానికి చోటు దక్కితే ప్రపంచ వారసత్వ సంపదగా ఈ చారిత్రక కట్టడం నిలవనుంది.

English summary
magnificent Shiva temple lepakshi gets unesco temporary heritage tag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X