మహాశివరాత్రి 2024: శోభాయమానంగా ముస్తాబైన శ్రీశైలం; మల్లన్న భక్తులకు శుభవార్త!!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత శోభాయమానంగా శ్రీశైలంలో శివయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండగా శ్రీశైలంలో భక్తుల సందడి కొనసాగుతుంది. శ్రీశైలంలో ఈ సంవత్సరం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి మార్చి 11 వరకు 11 రోజుల పాటు జరుగుతున్నాయి.

మార్చి 1న యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, అదే రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 2న భ్రుంగి వాహనసేవ నిర్వహించారు. మూడో తేదీ హంస వాహనంపై ఊరేగారు మల్లన్న. మార్చి 4 వ తేదీన మయూర వాహన సేవ, మార్చి 5 న రావణ వాహన సేవ నిర్వహించారు. 6 న నేడు పుష్ప పల్లకి సేవను, మార్చి 7న గజ వాహన సేవను నిర్వహించనున్నారు.

Maha shivratri 2024 Srisailam eye feast with floral decorations Good news for Mallanna devotees

ఆపై 8 వతేదీన మహా శివరాత్రి ప్రభోత్సవం కన్నుల పండుగగా చెయ్యనున్నారు. మహా శివరాత్రి పర్వదినాన నంది వాహనసేవతో పాటు, లింగోద్బవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగలంకరణ మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో చేస్తున్న పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా శ్రీశైలం వెళ్ళే భక్తులకు కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కర్నూలు డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేకంగా 310 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్టు కర్నూల్ డిపో రీజినల్ మేనేజర్ టి శ్రీనివాసులు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నుంచి ప్రారంభమైన ఈ బస్సులు ఈనెల 12వ తేదీ వరకు నడుస్తాయని వెల్లడించారు.

సాధారణ చార్జీలతోనే ఈ బస్సులను నడపనున్నట్లు, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరిన్ని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరు ఉన్న శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+