Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా శివరాత్రి నాడు ఆ చారిత్రాత్మక ఆలయంలో..

Maha Shivratri 2025: నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు జామునాటి మొదటి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరమశివుడిని దర్శించుకుంటోన్నారు.

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో వెలిసిన మహా కాళేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భస్మ హారతిని కళ్లారా వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటోన్నారు. సరిగ్గా తెల్లవారు జామున 3 గంటలకు తొలి పూజ ఆరంభమైంది.

Maha Shivratri 2025 Union Minister Ram Mohan Naidu attended the morning Aarti at Ujjain Temple

పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భస్మ హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. సాధారణ భక్తుడిలా అందరి మధ్యా కూర్చుని భజనలో పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ రఘువంశీ సహా పలువురు ప్రముఖులు భస్మ హారతిని తిలకించిన వారిలో ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తాకిడి నెలకొంది. పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శైవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణలో కీసరగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం, ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, శ్రీముఖం..వంటి ఆలయాల్లో భక్తుల కోలాహలంగా నెలకొంది.

మహా శివరాత్రి సందర్భంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వరస్వామి అశ్వ‌ వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా సాగింది.

వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అటు ఏపీఎస్‌ఆర్టీసీ, టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. శ్రీశైలం సహా ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి భక్తులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+