మహాశివరాత్రి 2023: హరహర మహాదేవ.. నేటినుండి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు షురూ!!

శ్రీశైలం మల్లన్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి మొదలవుతున్నాయి.

శివరాత్రి వస్తుందంటే చాలు చారిత్రక శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి. తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమవుతాయి. ఇక ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. శ్రీశైలం మల్లన్న కోరి కొలిచే వారి కొంగుబంగారంగా, భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినం వస్తుందంటే శ్రీశైలానికి భక్తులు పోటెత్తే పరిస్థితి ఉంటుంది.

నేటి నుండి మొదలుకానున్న శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు

నేటి నుండి మొదలుకానున్న శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మొదలుకానున్న శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు ఆలయ పండితులు, అధికారులు. నేడు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు. ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అత్యంత ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమంలో ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు.

ఘనంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

ఘనంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

ఇప్పటికే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆలయంలోనూ మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత ప్రమాణాలను పాటిస్తూ భద్రతకు పెద్దపీట వేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకే ఈ మేరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లను చేశారు.

నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు 11వ తేదీన సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరగనుంది. తరువాత 12వ తేదీన స్వామివారికి భృంగి వాహన సేవను నిర్వహించనున్నారు. 13వ తేదీన హంస వాహన సేవ, అదే రోజు విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 14వ తేదీన మయూర వాహన సేవ, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

18 వ తేదీన ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం

18 వ తేదీన ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం

15వ తేదీన రావణ వాహన సేవను నిర్వహిస్తారు. ఆరోజు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక 16వ తేదీన పుష్ప పల్లకి సేవ, 17వ తేదీన గజవాహన సేవ, 18 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, ఆపై పాగాలంకరణ చెయ్యనున్నారు. అర్థరాత్రి 12 గంటలకు స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.

శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పూర్తి

శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు పూర్తి

19వ తేదీన సాయంత్రం రథోత్సవాన్ని, ఆపై తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాన్ని, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు అయిన 21వ తేదీన స్వామివారికి అశ్వవాహన సేవను, రాత్రి 8 గంటలకు పుష్పోత్సవాన్ని, ఆపై శయనోత్సవాన్ని, ఏకాంత సేవను నిర్వహించి మల్లన్న బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+