ఆ విషయం తెలిసి సంతోషించా: బుర్రిపాలెంపై మహేష్ బాబు, వారికి థ్యాంక్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

బుర్రిపాలెం: నటుడు మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో ఆయన అభిమానులు మెగా శిబిరం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.

మహేష్ బాబు పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు

మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇటీవల మహేశ్‌ పుట్టినరోజును జరుపుకొన్నారు.

పేదలకు ఉచిత వైద్య సేవలు

పేదలకు ఉచిత వైద్య సేవలు

ఈ సందర్భంగా అభిమానులు ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు.

మహేష్ బాబు ఆనందం

మహేష్ బాబు ఆనందం

తన దత్తత గ్రామం బుర్రిపాలెంలో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని మహేశ్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఆ విషయం తెలిసి సంతోషపడ్డా

ఆ విషయం తెలిసి సంతోషపడ్డా

బుధవారం బుర్రిపాలెంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించిందని మహేష్ పేర్కొన్నారు.

వారందరికీ అభినందన

వారందరికీ అభినందన

పలు అనారోగ్య సమస్యలు, వ్యాధులపై అవగాహన కల్పించారని మహేష్ బాబు అన్నారు. దీన్ని నిర్వహించిన ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఇప్పటి వరకు గ్రామంలో మొత్తం 11 వైద్య శిబిరాల్ని నిర్వహించారని చెబుతూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
'Happy to know about the mega multispeciality health camp held in Burripalem. The camp led by Andhra Hospitals all specialties, including medicine, surgery, Pediatrics, Gynecology, Cardiology, Orthopedics, ENT & Dietitian covered awareness session & common health problems. Kudos to Dr. P.V. Rama Rao & his team for successfully conducting the 11th camp in the village. Thank you very much!' Mahesh Babu posted on Facebook
Please Wait while comments are loading...