ఇచ్చి వెళ్లు: మహేష్ కత్తి రివర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మద్దతుగా ఇలా!!

Posted By:
Subscribe to Oneindia Telugu
  'అజ్ఞాతవాసి' పై మహేష్ కత్తి రియాక్షన్..!

  హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. ఈ సినిమా రికార్డులు సృష్టించింది. అమెరికాలో బాహుబలి 2 తర్వాత తొలి రోజు కలెక్షన్‌లలో టాప్‌లో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోను అజ్ఞాతవాసి ఫీవర్ ఉంది.

  పవన్‌కు బాబు 'సంక్రాంతి' కానుక, చిరంజీవికి అలా: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంటూ

  అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. అభిమానులు, సినిమా చూసిన వారు కొందరు సినిమా అద్భుతమని చెబుతున్నారు. అయితే కొన్ని రివ్యూలు సినిమా యావరేజ్ అని, అంత బాగా లేదని చెబుతున్నాయి. సినిమా కలెక్షన్లు బాగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. పలు రికార్డులు కూడా బద్దలు కొట్టారు.

  టెక్నాలజీతో 'అజ్ఞాతవాసి'పై అభిమానం: నెల్లూరులో పవన్ ఫ్యాన్స్ గొడవకు డీఎస్పీ చెక్!

   అజ్ఞాతవాసిపై మహేష్ కత్తి

  అజ్ఞాతవాసిపై మహేష్ కత్తి

  నిత్యం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయనను టార్గెట్ చేస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తి కూడా అజ్ఞాతవాసి సినిమాపై స్పందించారు. పవన్, త్రివిక్రమ్ కెరీర్లో అత్యంత దారుణమైన సినిమా అని, రిస్క్ చేసి చూస్తే.. టైమేమో.. మీ ఇష్టం (ఈ సినిమా పాట ట్యూన్‌లో) అని కామెంట్ చేశారు. తద్వారా సినిమా అంతబాగా లేదని చెప్పారు.

   నిన్నటి దాకా అభిమానులతో మాటల యుద్ధం

  నిన్నటి దాకా అభిమానులతో మాటల యుద్ధం

  ఆ తర్వాత మహేష్ కత్తి ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టారు. నిన్నటి వరకు ఏ అభిమానులతో అయితే మాటల యుద్ధానికి దిగారో, ఇప్పుడు అదే అభిమానులకు ఏదైనా ఇవ్వాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త వాదన తీసుకు వచ్చారు.

   అభిమానులకు ఏదైనా తిరిగివ్వాలి

  అభిమానులకు ఏదైనా తిరిగివ్వాలి

  పవన్ కళ్యాణ్‌కు ఉన్న స్టార్ డమ్, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పరిగణలోకి తీసుకుంటూ... అని చెబుతూ.. ఆయన అభిమానులకు ఏదైనా తిరిగి ఇవ్వాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన అభిమానుల కోసం మరో సినిమా చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో పూర్తిస్థాయిగా రాజకీయాలపై పవన్ దృష్టి సారించనున్నారు. ఇది అభిమానులను నిరాశకు గురి చేసే అంశం. అయితే ప్రజా సమస్యల కోసం రాజకీయాలపై దృష్టి పెడుతున్నందున అది సంతోషకరమే అంటున్నారు.

  ఇదీ పవన్ కళ్యాణ్

  ఇదీ పవన్ కళ్యాణ్

  తద్వారా ఈ సినిమా బాగా లేదని, మంచి సినిమాను ఇచ్చి ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలని మహేష్ కత్తి.. పవర్ స్టార్‌కు సూచించారు. అయితే, పవన్ కళ్యాణ్ హిట్టు, ఫట్లను పట్టించుకోడని, సినిమా బాగుంటే చూడమంటారని, లేదంటే వదిలేయమంటారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'Taking his stardom and fan base into consideration, he has to give back something to his fans. If he can do that, he should give with a bang. I want him to do an another film before he goes into full time politics.' Mahesh Kathi tweet.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి