Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం చేసుకుంటావో చేసుకో: రాంకీ, పవన్‌పై మహేష్ కత్తి షాకింగ్, జగన్‌పై విమర్శ, దాడిపై కీలకం సమాచారం

హైదరాబాద్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ ద్వారా అభిమానులకు, కార్యకర్తలకు ఓ సందేశం పంపించారు. పార్టీ పెట్టి నాలుగేళ్లు కూడా కాలేదని, ప్రస్తుతం పసిప్రాయంలో ఉందని, కొందరు జనసేనను ఎదగనీయకుండా ప్రయత్నిస్తున్నారని, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని, కాబట్టి ఎవరూ ఆవేశపడవద్దన్నారు.

చదవండి: చిరంజీవికి అలా చెప్పి ఎక్కడ దాక్కున్నావ్: రేణుని లాగి పవన్‌పై మహేష్ కత్తి, దుమ్ముదులిపిన రాంకీ

చదవండి: తగ్గను: జనసేన కీలక ప్రకటనపై మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అనుమానం నిజమే! ఇదీ విషయం!

దీనిపై ఓ టీవీ ఛానల్లో మహేష్ కత్తి, నటుడు, నిర్మాత రాంకీ తదితరులు స్పందించారు. పవన్ స్పందించారని, కాబట్టి ఇప్పటికైనా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. కానీ మహేష్ కత్తి మరో మెలిక పెట్టారు. తనకు సారీ చెప్పే వరకు తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే వివాదం పెంచాలని మహేష్ కత్తి భావిస్తున్నారని స్ఫష్టంగా అర్థమవుతోందని తేల్చారు.

చదవండి: బ్రోకర్, శతఘ్ని.. పవన్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి సారీ చెప్పిస్తా: మహేష్ కత్తి సంచలనం, మెలిక

చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

 టేక్ కేర్ కత్తీ అని రాంకీ హెచ్చరిక

టేక్ కేర్ కత్తీ అని రాంకీ హెచ్చరిక

ఈ నేపథ్యంలో రాంకీ స్పందించారు. జనసేన ప్రకటన విడుదల చేసినందున అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. మహేష్ కత్తి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని భావిస్తున్నట్లు తెలిపారు. మహేష్ కత్తి మాత్రం తనకు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే అన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాంకీ.. మహేష్ కత్తి ఉద్దేశ్యాన్ని పసిగట్టారు. దీంతో ఆయన విసుగెత్తిపోయారు. ఇంత చెబుతున్నా వినకుంటే ఏం చేసుకుంటావో చేసుకో.. టేక్ కేర్ కత్తీ అని హెచ్చరించారు.

 పవన్ కళ్యాణ్ లోపమేనని పరోక్షంగా

పవన్ కళ్యాణ్ లోపమేనని పరోక్షంగా

నాలుగేళ్ల పసిప్రాయంలోని జనసేనపై కుట్ర జరుగుతోందన్న ప్రకటనపై మహేష్ కత్తి స్పందించారు. ఎదిగే ప్రయత్నమేమీ జనసేనలో లేదని, ప్రజాస్వామ్యంగా ఓ పార్టీ ఉండాలంటే అందులో ఓ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండాలే కానీ అదేదీ లేకుంటే పార్టీ పసిప్రాయంలో ఉండకపోతే ఎలా ఉంటుందని అడిగారు. ఎదగకపోవడం అనేది వాళ్ళ లోపమే తప్పితే ఎవరో చేసిన కుట్ర కాదని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. కుట్ర అంటున్నారని, ఎవరు కుట్ర చేశారన్నారు. తప్పులు చేస్తూ, సమర్థత లేకుండా పార్టీని కొనసాగిస్తూ ఇతరుల కుట్ర అంటే ఎలా అన్నారు.

వైసీపీని టార్గెట్ చేసిన మహేష్ కత్తి కానీ

వైసీపీని టార్గెట్ చేసిన మహేష్ కత్తి కానీ

మొదటి నుండి తాను చేసే వ్యాఖ్యలు గనక సీరియస్‌గా తీసుకొని ఉంటే పార్టీ నిర్మాణం ఎప్పుడో జరిగి ఉండేదని మహేష్ కత్తి అన్నారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో టిడిపి, వైసిపీ రాజకీయాలు ప్రజాకంటకం అవుతున్నాయి తప్పితే ప్రజా క్షేమం కోరే రాజకీయాలు కావడం లేదని చాలామంది అనుకుంటున్నారని అన్నారు. అనాలోచితంగా వైసీపీ పైన కూడా ఆయన ఓ విమర్శ చేశారు. అయితే తన వెనుక వైసీపీ లేదని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా కూడా ఈ వ్యాఖ్య చేసి ఉంటారని అంటున్నారు.

అందుకే నేను వ్యక్తిగతంగా టార్గెట్

అందుకే నేను వ్యక్తిగతంగా టార్గెట్

ఈ సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన రూపంలో భిన్న దృక్పధంతో వచ్చిన పవన్ కళ్యాణ్ భయం లేకుండా దూసుకెళ్తాడనే ఆశ ప్రజల్లో ఉందని మహేష్ కత్తి అన్నారు. ఇలాంటి తరుణంలో పవన్ తీరుపై తన విమర్శలు రాజకీయ పరంగా ఉన్నాయే తప్పితే వ్యక్తిగతంగా లేవని చెప్పారు. వాళ్ళే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో తాను వ్యక్తిగతం అయ్యానని చెప్పారు.

 అతనే నిజమైన హీరో

అతనే నిజమైన హీరో

తన మీద జ‌రిగిన దాడికి అదే ప్రెస్ నోట్లో ఖండిస్తున్న‌ట్లు చిన్న ముక్క రాస్తే స‌రిపోయేది కదా అని, ఎందుకింత ఇగో అని, తన మీద దాడి జ‌రిగిన‌ప్ప‌టికీ క‌నీసం క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పలేదని, ముందు చూపులేక మాట్లాడుతున్నారా అని ప్ర‌శ్నించారు. తన మీద‌ దాడి జ‌రిగేంత వ‌ర‌కు ఇటువంటి ప్ర‌క‌ట‌న చేయాల‌ని తెలియ‌దా అన్నారు. త‌న‌ అభిమానుల‌ వ‌ల్ల ఒక‌రికి ఇబ్బందులు క‌లుగుతున్నప్పుడు, ఇటువంటివి చేయొద్ద‌ని చెప్పేవాడే నిజ‌మైన హీరో అన్నారు. దాడులు చేయ‌డం అప్ర‌జాస్వామికమైన‌ద‌ని ఆ లేఖ‌లో పేర్కొంటే స‌రిపోయేది అన్నారు.

మహేష్ కత్తిపై దాడి కేసులో కీలక సమాచారం

మహేష్ కత్తిపై దాడి కేసులో కీలక సమాచారం

ఇదిలా ఉండగా, మహేష్ కత్తిపై దాడి కేసులో కీలక సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. దాడికి పాల్పడినవారికి నోటీసులకు పంపుతామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+