హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగ్గను: జనసేన కీలక ప్రకటనపై మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అనుమానం నిజమే! ఇదీ విషయం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ ప్రకటనపై మహేష్ కత్తి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో శుక్రవారం స్పందించారు. తన అభిమానులకు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఓ ప్రకటన చేసినప్పటికీ ఆయన తగ్గడం లేదు. మహేష్ కత్తి తీరు చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే పవన్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా
కనిపిస్తోందని అంటున్నారు.

చదవండి: 2 నిమిషాలు మాట్లాడుతామంటే, అందుకే మహేష్ కత్తిపై గుడ్లు విసిరాం: స్టూడియోకు యువకులు

జనసేన ప్రకటనపై మహేష్ కత్తి స్పందించారు. ఇలాంటి లేఖతో తన పోరాటం ఆగదని చెప్పారు. పవన్ క్షమాపణ చెప్పే వరకు తాను విశ్రమించనని అన్నారు. తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు. జనసేన నుంచి ప్రకటన విడుదలయ్యాక కూడా ఆయన తగ్గక పోవడాన్ని బట్టి ఉద్దేశ్యపూర్వకంగానే, ప్రీ ప్లాన్డ్‌గానే ఇది జరుగుతోందని అర్థమవుతోందని అంటున్నారు.

చదవండి: పోర్న్‌స్టార్‌కే: పూనమ్ కౌర్ మళ్లీ సంచలన ట్వీట్, మహేష్ కత్తికి దిమ్మతిరిగే షాక్!

అప్పుడు మళ్లీ స్పందిస్తే బావుండేది

అప్పుడు మళ్లీ స్పందిస్తే బావుండేది

జనసేన లేఖ విడుదల చేసినప్పటికీ మహేష్ కత్తి తగ్గకపోవడంపై నటుడు, నిర్మాత రాంకీ తీవ్రంగా స్పందించారు. అసలు ఆయనకు ఈ అంశాన్ని వదిలేయాలనే ఉద్దేశ్యం లేదన్నారు. ఎక్కడో తెంపుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రకటన విడుదలయ్యాక కూడా ఆగవచ్చు కదా అన్నారు. మళ్లీ బెదిరింపులు వస్తే, లేదా మరొకటి జరిగితే అప్పుడు తిరిగి స్పందిస్తే అర్థం ఉండేదని అంటున్నారు.

 ఏమిటి పవన్ కళ్యాణ్ సారీ చెప్పడం ఏమిటి

ఏమిటి పవన్ కళ్యాణ్ సారీ చెప్పడం ఏమిటి

జనసేన ఇప్పుడు ప్రకటన విడుదల చేసిందని, సారీ చెప్పే వరకు వదిలేది లేదని అంటున్నాడని, అలా చెప్పాక మరొకటి అంటారని రాంకీ అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ నుంచి మహేష్ కత్తి సారీ ఆశించడం ఏమిటని అన్నారు. ప్రకటన విడుదలయ్యాక కూడా మహేష్ కత్తి తగ్గడం లేదంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతోందని ఒకరు అభిప్రాయపడ్డారు. పవన్‌ను వదిలేయాలని ఆయనకు లేదని, కుట్రలు జరుగుతున్నాయన్న జనసేన ప్రకటన వాస్తవమేనని ఈ వ్యాఖ్యలతో అర్థమవుతోందని అంటున్నారు.

 జనసేన ప్రకటన

జనసేన ప్రకటన

కాగా, మహేష్ కత్తితో అభిమానుల వివాదం నేపథ్యంలో జనసేన ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. జనసేన పెట్టి నాలుగేళ్లు కూడా కాలేదన, ప్రస్తుతం పసిప్రాయంలో ఉన్నామని, కొందరు జనసేనను ఎదగనీకుండా ప్రయత్నిస్తున్నారని, ఇదంతా రాజకీయంలో భాగమేనని ఆ ప్రకటనలో పార్టీ తెలిపింది.

 కుట్రతో చేసే ఆరోపణలపై స్పందించవద్దు

కుట్రతో చేసే ఆరోపణలపై స్పందించవద్దు

కార్యకర్తలు, అభిమానులు ఆవేశపడవద్దని జనసేన తన ప్రకటనలో తెలిపింది. జనసేన అభిమానులను, కార్యకర్తలను గందరగోళపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆరోపణలు చేసినా ఎవరూ స్పందించవద్దన్నారు. కుట్రతో చేసే ఆరోపణలపై ఎవరూ ఆవేశపడి స్పందించవద్దన్నారు.

చికాకు పర్చేందుకు

చికాకు పర్చేందుకు

పార్టీ అంతర్గత నిర్మాణంలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు సాగుతున్నామని, ఈ తరుణంలో కొందరు పేరు కోసమో లేదా మన దృష్టిని మరల్చడానికో లేదా మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చూస్తుంటారని, అలాంటి వారిపై స్పందించవద్దని మనవి చేస్తున్నట్లు జనసేన పేర్కొంది.

మీ ఆవేశం పార్టీకి నష్టం చేయవచ్చు

మీ ఆవేశం పార్టీకి నష్టం చేయవచ్చు

తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా, తనకు అపకీర్తి తెచ్చేలా మాట్లాడినా హుందాగా ప్రవర్తిద్దామని, ఒక్కోసారి మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా, నష్టం చేయవచ్చునని, మనపై చేస్తున్న ప్రతి విమర్శకు పార్టీ లెక్కగడుతూనే ఉందని, అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం సందర్భం చూసి పార్టీ స్పందిస్తుందని, మనం ప్రజాసేవ పరమావదిగా ముందుకు వెళ్లాలని, హుందాగా పార్టీ కోసం పని చేద్దామన్నారు.

English summary
Jana Sena with it vice president B Mahender Reddy's signature released a press note appealing to its activists and Pawan Kalyan's fans. Mahesh Kathi responded on this note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X