తమన్నాకు గట్టిగా ముద్దుపెట్టిన అభిమాని.. వీడియో వైరల్..

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది. చాంద్ సా రోషన్ చేహేర అనే మూవీతో 2005లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తమన్నా అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులోనూ ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి, ఓదెలా 2, ఎఫ్ 2, ఎఫ్ 3, స్త్రీ 2 చిత్రాలతో అలరించింది.

సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటెమ్ సాంగ్స్ తోనూ మెప్పించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది తమన్నా. అయితే తాజాగా తమన్నాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహిళా అభిమాని కోరిక తీర్చింది. తాజాగా ఓ ఈవెంట్‌ కు తమన్నా వెళ్లగా ఆమె నటించిన స్త్రీ-2 మూవీలోని ఆజ్‌ కీ రాత్ సాంగ్‌ కు నృత్య బృందం డాన్స్ చేసింది.

tamannaah OnStage Kiss by Fan Video Explodes on Social Media Tamannaah Fan Kiss video goes viral

వారి పర్ఫార్మెన్స్ నచ్చడంతో తమన్నా స్టేజిపైకి చేరుకొని వారితో కలిసి స్టెప్పులేసింది.. అంతలోనే తమన్నా పక్కనే ఉన్న ఓ లేడీ డాన్సర్ ముద్దు పెట్టుకుంటానని తమన్నాను అడగ్గా వెంటనే ఆమె ఒప్పుకున్నారు. దీంతో అభిమాని కిస్ చేయగా తర్వాత తమన్నా కూడా ఆమెకు ముద్దు పెట్టింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇటీవ‌ల వెల్‌ టెక్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన ఓ వేడుక‌లో త‌మ‌న్నా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అభిమాని కోరిక తీర్చిన తమన్నాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. త‌మ‌న్నా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అటు త‌మ‌న్నా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె మ‌న‌సు బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్ విషయంలో త‌మ‌న్నా ఇచ్చే విలువ‌కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+