ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. పవన్ కల్యాణ్ డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాడు నీకు భయపడలేదా.. అసలు ఎవరికీ భయపడలేదా, వాయిలెన్స్ అంటే మీనింగ్ తెలియని మీ అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయింది.. వాయిలెన్స్ అంటే అర్థం ఏంటో చూపిస్తా.. అర్థం, భావం, తెలుగు భాషలో నాకు నచ్చని పదం డ్యాన్స్.. అలాగే చివరగా ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ మేరకు మార్చి 15 ఆదివారం రోజున ప్రీ- రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్లు తెలుస్తోంది. 2 నిమిషాల 7 సెకన్ల ట్రైలర్ కట్ ఆకట్టుకుంటోంది. పవర్ స్టార్ డైలాగ్స్, యాక్షన్, తమన్ BGM మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి.

ఇక పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications