గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలోని గిరిజన గ్రామాలకు వరాల జల్లు కురిపించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున నిధులను కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు . నందిగరువు లో పాఠశాల భవనం, అంగన్వాడి కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే కొత్తపలం గ్రామం ప్రజల విజ్ఞప్తుల మేరకు గ్రామానికి 1.6 కిలోమీటర్ రోడ్డు నిర్మిస్తామన్నారు.

ఆవిర్భావ దినోత్సవం గిరిజన గ్రామంలో చేసుకున్న పవన్ కళ్యాణ్

విబి జిరామ్ జి పథకం కింద గిరిజన గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టారు. గిరిజన గ్రామాలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. లగిసుపల్లి హెలిపాడ్ నుంచి ఓనూరు జంక్షన్ చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కాలినడకన ఓనూరు గ్రామానికి చేరుకున్నారు.

ap deputy cm Pawan Kalyan said good news announced funds for the development of tribal villages

ఓనూరులో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్

ఓనూరులో పాఠశాల విద్యార్థులకు పవన్ కళ్యాణ్ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. జల జీవన్ మిషన్ పథకంలో ఏర్పాటు చేసిన నీటి కుళాయి పనులను ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి పవన్‌తో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్, కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు.అక్కడి నుంచి ఓనూరు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, గర్భిణీలకు పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు.

నందిగరువులో గిరిజనులతో మాటా మంతీ

ఆ తర్వాత ఓనూరు ఎంపీపీ పాఠశాలకు వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. వారికి పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసి, సర్వశిక్షణా అభియాన్ అధికారి స్వామి నాయుడు నుంచి పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నడుచుకుంటూ నందిగరువు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం ప్రజలతో 'మాటామంతి' కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గిరిజనుల సంక్షేమం కాంక్షించిన పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గిరిజనులు బాగుండాలని ఆకాంక్షించారు. మీరు బాగుండాలి..మీరు ఎవరూ కన్నీళ్లు పెట్టొద్దు..మేమంతా ఉన్నది మీకు మంచి చేయడానికే అని పేర్కొన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడుతారు..కానీ నేను భయపడనన్న పవన్ కళ్యాణ్ తాను సాధ్యమైనంతవరకు వారికి మంచే చేస్తానన్నారు.

గిరిజన గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించిన పవన్ కళ్యాణ్

తాను ఏ పార్టీ అనేది చూడనని, మీరు మాకు ఓట్లు వేసారా లేదా చూడలేదని, మీరంతా మా అన్నదమ్ములు, ఆడపడుచులు అదే చూసానన్నారు. తాను ప్రజల కోసం పనిచేసే వాడిని స్పష్టం చేశారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టంచేశారు. గత ప్రభుత్వనిధులు మళ్లింపు ఏజెన్సీ వెనుకబాటుతనానికి కారణమన్నారు. నందిగరువు గ్రామంలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

ఏజెన్సీలో డోలీల మోతలు కనిపించకూడదని రోడ్లు వేశాం

40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేయించాం అన్నారు. ఏజెన్సీలో డోలీల మోతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడూ మీ గ్రామానికి రాలేదని, మీ కష్టం వినలేదని, ఏనాడు మీ అభివృద్ధి ఊసు ఎత్త లేదని, గత వైసిపి పాలకులపై నిప్పులు చెరిగారు.

18 నెలల్లోనే గిరిజన గ్రామాలలో 460 కిలోమీటర్ల మేర రోడ్లు

తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాలలో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామన్నారు. ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థులు గెలవకపోయినా ఎక్కడా తాము వివక్ష చూపించలేదు అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచి నీరు అందిస్తాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+