ఇండస్ట్రీలో స్టార్ హీరో.. పాలిటిక్స్ లోకి వచ్చి రేపిస్టులకు మద్దతు: చిన్మయి సంచలనం

సింగర్ చిన్మయి గురించి మనందరికీ తెలిసిందే.. సింగర్‌ గా ఆమె చాలా మంచి పాటలను అందించారు. అలాగే మహిళల సమస్యలు, క్యాస్టింగ్ కౌచ్, సామాజిక సమస్యలపైనా ఆమె గళం ఎత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మహిళల డ్రెస్సింగ్ విషయంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పైన ఆమె స్పందించిన విషయం తెలిసిందే. అలాగే అత్యాచార కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు అయోధ్య సందర్శనపై ఇటీవల ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

అయితే తాజాగా మరో అంశంపై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడాన్ని అభినందిస్తూ తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌ ట్వీట్ చేశారు. అయితే ఇదే అంశంపై సింగర్ చిన్మయి కమల్ హాసన్ మీద మండిపడ్డారు. 'ఈ వ్యక్తి పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఉంటూ పాలిటిక్స్‌ లోకి వచ్చారు. ఆయన(వైరముత్తు) లైంగికంగా తనను వేధించాడని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇతను మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తుంచుకోవాలి' అని సూచించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో వైరముత్తు తనను వేధించాడని చిన్మయి తరచూ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే..

ఇక లిరిసిస్ట్‌ వైరముత్తుకు ఇటీవల జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. దీంతో తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అటు సీఎం స్టాలిన్, స్టార్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా వైరముత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్యం పరంగా దేశంలో అందించే అత్యున్నత అవార్డు ఇదే కావడం విశేషం. ఇక ఈ అవార్డు అందుకున్న తమిళనాడుకు చెందిన మూడో వ్యక్తిగా వైరముత్తు నిలిచారు. ఈ అంశంపైనే తాజాగా చిన్మయి ఘాటుగా స్పందించారు.

chinmayi singer Slams Kamal Haasan for Congratulating Vairamuthu on Jnanpith Award Viral Attack

ఈ మేరకు కమల్ హాసన్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమను లైంగికంగా వేధించాడని చెప్పినా మహిళలను పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని కమల్ పై కీలక పోస్టు పెట్టారు చిన్మయి. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని.. ఈ విషయాన్ని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+