విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!
విద్యార్ధులు పరీక్షల్లో బిజీగా ఉన్నారు. పదో తరగతి పరీక్షలు ఏపీలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన తరగతులకు వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక.. వేసవి తీవ్రత పెరగటంతో ఒంటి పూట బడుల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల వేళ ఆర్టీసీలో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వెసులు బాటు కల్పించారు.
పరీక్షల వేళ విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కృష్ణాజిల్లాలో రేపు రెండో శనివారం సెలవు రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థ లు ఈ నెల 14న రెండో శనివారమైనా సెలవు లేకుండా పని చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి సుబ్బారావు ఆదేశించారు. గతేడాది అక్టోబరులో మొంథా తుపాను సందర్భంగా అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారన్నారు. ఆ నాలుగు రోజుల సెలవులకు బదులుగా అన్ని విద్యా సంస్థలు ఇప్పటికే మూడు రోజులు పని చేశాయన్నారు. మిగిలిన ఒక రోజు సెలవుకు బదులుగా రాబోయే రెండో శనివారం అన్ని విద్యా సంస్థలు పని చేయాలని డీఈవో పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షల వేళ విద్యార్ధుల కోసం
కాగా, పెరుగుతున్న ఎండల వేళ మార్చి 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి. అటు తెలంగాణలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పాఠశాలలు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ కొనసాగనున్నాయి. పదవ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. ఉక్కబోతలు, ఎండవేడిమి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఏటా ఒంటి పూట బడుల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో https://bse.ap.gov.in/ పొందుపరిచారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.












Click it and Unblock the Notifications