వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి మోసం: పవన్ కల్యాణ్ వైఖరిని ఉతికి ఆరేసిన మహేష్ కత్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరిపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందనే వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన ప్రశ్నలు సంధించారు.

మహేష్ కత్తికి, పవన్ కల్యాణ్‌కు మధ్య కొన్ని నెలల పాటు చెలరేగిన వివాదం సమసిపోయినట్లు భావించారు. కానీ తాజాగా, మహేష్ కత్తి పవన్ కల్యాణ్ రాజకీయాలపై విమర్శలు ఎక్కుపెడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

 పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

మహేష్ కత్తి బుధవారం పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాను తప్పు పడుతూ ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఆయన మరోసారి దుమారం రేపారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అందులోకి లాగారు.

Recommended Video

Pawan Kalyan Invites Raghuveera Reddy to JFC Meeting
 ముందు చిరంజీవి మోసం గురించి..

ముందు చిరంజీవి మోసం గురించి..

"నాయుడు రాయ్, కాపు పిల్లల్లారా... పవన్ కల్యాణ్‌ని రాజకీయంగా నమ్మే ముందు చిరంజీవి కాపు కులానికి చేిసన మోసం గురించి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకోండి. సినిమా పరిశ్రమల్లోనూ... రాజకీయాల్లోనూ కాపులకి చిరంజీవి చేసిందేమీ లేదు. ముద్రగడ పద్మనాభం అసలైన లీడర్, వీళ్లు కాదు" అని బుధవారం ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్‌పై మరో ట్వీట్ ఇలా...

పవన్ కల్యాణ్‌పై మరో ట్వీట్ ఇలా...

"ఎన్నికల్లో మాత్రం టిడిపి - బిజెపికి నువ్వు సపోర్టు. ఇప్పుడు నీకు కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెసు సపోర్టు కావలి.. ఏమయ్యా పవన్ కల్యాణ్.... అంతేనా" అని కత్తి మహేష్ మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే దీనిపై విమర్శలు ప్రారంభమయ్యాయి.

బాబు వైఖరి వల్లే...

బాబు వైఖరి వల్లే...

చంద్రబాబు పవన్ కల్యాణ్ విషయంలో అనుసరించాల్సిన వైఖరి గురించి తమ పార్టీ నాయకులకు సూచనలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను ఏమీ అనవద్దని ఆయన చెబుతున్నారు. దీనివల్ల పవన్ కల్యాణ్ రాజకీయాలకు నష్టం వాటిల్లుతోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం దానివల్ల కలుగుతోంది.

English summary
Cine critic Maheesh Kathi once again tweeted against Jana Sena Chief Pawan Kalyan's political stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X