పవన్ కల్యాణ్ వైరస్, హెచ్ఐవి కన్నా డేంజర్: మహేష్ కత్తి

Posted By:
Subscribe to Oneindia Telugu
Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !

హైదరాబాద్: సినీ విమర్శకుడు మహేష్ కత్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేస్తున్న వరుస విమర్శల నేపథ్యంలో మరో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

పవన్ కల్యాణ్ వైరస్‌లా మారాడని, హెచ్ఐవి కన్నా ప్రమాదకరంగా పరిణమించాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి ఆయన తన వ్యాఖ్యలను ఆంగ్లభాషలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్ తనపై చేస్తున్న ప్రచారాన్ని కూడా ఎత్తిచూపారు.

 పికే ఫ్యన్స్ చేస్తున్నది ఇదీ...

పికే ఫ్యన్స్ చేస్తున్నది ఇదీ...

గత కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దీన్ని పంపిణీ చేస్తున్నారని మహేష్ కత్తి వ్యాఖ్యానిస్తూ దానికి సంబంధించిన ఇమేజ్‌ను కూడా పోస్టు చేశారు. దాన్ని చూసి తన మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారని, వాస్తవమేమిటో తెలుసుకోవడాని ఫోన్లు కూడా చేశారని ఆయన అన్నారు. అది తీవ్రమైన స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు.

 వారంతా పిల్లలు, తెలియదు..

వారంతా పిల్లలు, తెలియదు..

తనపై దుష్ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మిత్రులు సూచిస్తున్నారని, వారి అసభ్యకరమైన పోస్టులపైనా తనను చంపుతామని బెదిరిస్తున్న వైనంపైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నరని, అయితే తన హృదయం అందుకు అంగీకరించడం లేదని, వారి పిచ్చి బయటకు వస్తోందని మహేష్ కత్తి అన్నారు.

 పికే ప్రమాదకరమైన వైరస్

పికే ప్రమాదకరమైన వైరస్

పవన్ కల్యాణ్ వైరస్‌గా మారిపోయారని, హెచ్‌ఐవి కన్నా ప్రమాదకరంగా పరిణమించాడని, తరాలబడిగా వస్తున్న హేతుబద్దమైన ప్రవర్తనను, సివిక్ సెన్స్‌ను అది మింగేస్తోంందని మహేష్ కత్తి అన్నారు. ఆ పిచ్చికి సామాజిక చికిత్స అవసరమని అన్నారు. దానికి చట్టపరమైన పరిష్కారం లేదని అన్నారు.

 పందిలాగా చిత్రిస్తూ...

పందిలాగా చిత్రిస్తూ...

తనను పందిలాగా చిత్రిస్తూ కొన్ని ఫేస్‌బుక్ పేజీల సృష్టి జరిగిందని మహేష్ కత్తి అన్నారు. గీతా ఆర్ట్స్‌లో ఆ పని జరిగినట్లు తెలుస్తోందని, దానిపై అల్లు అరవింద్ చర్యలు తీసుకోకపోతే తాను తగిన విధంగా చర్యలకు దిగాల్సి వస్తుందని ఆయన అన్నారు. తన ఫోన్ నెంబర్ కూడా అక్కడికే వెళ్తోందని ఆయన అన్నారు. తాను గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్‌కు వ్యతిరేకం కాదని, దయచేసి అటువంటి చర్యలకు స్వస్తి చెప్పేలా చూడాలని మహేష్ కత్తి అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahesh Kathi says "PK has become a virus. He is more dangerous than HIV that is eating away a generations rational behaviour and civic sense".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి