వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ భవిష్యత్తుకు ఘోరీ కడ్తా: మహేష్ కత్తి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mahesh Kathi vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఘోరీ కడ్తా !

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానుల వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు.

పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కనిపించినప్పటికీ ఆయన నేరుగా పవన్ కల్యాణ్‌నే టార్గెట్ చేశారని చెప్పవచ్చు. ఇది ఎంత దూరం పోతుందనేది చెప్పలేని స్థితి.

 మీరు తిట్టే ప్రతి బూతు... కూసే ప్రతి కూతా

మీరు తిట్టే ప్రతి బూతు... కూసే ప్రతి కూతా

"మీరు తిట్టే ప్రతి బూతు. కూసే ప్రతికూతా. చేసే ప్రతి కాల్. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ ప్రవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకొండి. Each word used against me towards my character assassination will only bring Pawan Kalyan's political wipeout nearer. Be warned!" అని మహేష్ కత్తి తాజాగా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు.

 పవన్ కల్యాణ్‌ను ఏబ్రాసీ చేయవద్దు...

పవన్ కల్యాణ్‌ను ఏబ్రాసీ చేయవద్దు...

"ఒక జోకర్ ని మరొక జోకర్. ఒక బ్రోకర్ ని మరొక బ్రోకర్ సమర్ధించుకోవడం సహజం. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కనీసం కొంత తెలివి ఉంది. మీలాంటోళ్లు అనవసరంగా మొరిగి పవన్ కళ్యాణ్ ని మరీ ఏబ్రాసిని చేయకండి. ఆల్రెడీ చాలా వరకూ అయ్యాడు" అని పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి మహేష్ కత్తి అన్నారు.

 కొందరు మిత్రులకు అలా అనిపించింది...

కొందరు మిత్రులకు అలా అనిపించింది...

ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ గురించి కూడా మహేష్ కత్తి ప్రస్తావించారు. "నేను కొంత సంయమనం కోల్పోయానని కొందరు మిత్రులకు అనిపించింది. నిజమే. నాకు కూడా అనిపించింది. కాకపోతే అది ఏ పరిస్థితుల్లో అనేది కూడా గమనించాలని కోరుతున్నాను. నా మీద ఎంత హేయమైన దాడి జరుగుతున్నదో, నా వ్యక్తిగత జీవితాన్ని, నా కుటుంబ సభ్యులని, నా వృత్తిని, నా ఉనికిని న్యూనపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని చోట్లా చేస్తున్నారో గమనించాలి" అని ఆయన అన్నారు.

 నేను కూడా అలాగే మాట్లాడితే...

నేను కూడా అలాగే మాట్లాడితే...

"నేను ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నానని. నాకు ఎదో పార్టీ అండ ఉందని. నాకు ఎవరో డబ్బులు ఇస్తున్నారని. ఇలా ఎన్నెన్నో ఆరోపణలు. వీటిని దేనినీ ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్టు తమాషా చూస్తున్న పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తి మీద నాకు ఎందుకు గౌరవం ఉండాలి? అతని రాజకీయ ఉద్దేశాల్ని ఎలా నమ్మాలి? అక్కడా నేను వ్యక్తిగత దూషణలు చెయ్యలేదు. పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళలేదు" అని మహేష్ కత్తి అన్నారు.

 మర్యాద దాటకుండానే ఇస్తున్నాను..

మర్యాద దాటకుండానే ఇస్తున్నాను..

"మర్యాద హద్దులు దాటుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను ఇంకా మర్యాదలు దాటకుండానే సమాధానం ఇస్తున్నాను. ఇంకా సంయమనం పాటిస్తూనే ఉన్నాను. ఆ చెలియలకట్ట తెగేదాకా తీసుకురాకండి. అది జరిగిన రోజున ఖర్చైపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి" అని మహేష్ కత్తి అన్నారు.

రెండు రాష్ట్రాల్లో బాగున్నప్పుడు...

రెండు రాష్ట్రాల్లో బాగున్నప్పుడు...

"నువ్వు చెప్పినట్టే, రెండు రాష్ట్రాలలో పాలన బాగున్నప్పుడు జనసేన ఎవరి మీద దాడికి? శతగ్నిని ఎవరి మీద పేల్చడానికి? ఓహో ఇద్దరు నాయకులకు నీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అమ్ముకోవడానికా?! భలే మంచి చౌకబేరము" అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మహేష్ కత్తి అన్నారు.

English summary
Mahesh Kathi in his facebook comments says "Each word used against me towards my character assassination will only bring Pawan Kalyan's political wipeout nearer".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X