రూటు మార్చిన కత్తి మహేష్, ట్విట్టర్‌లో సంచలన ‘ప్రకటన’, ఈసారి ఏపీ ఎంపీలపై, ఏమన్నారంటే...

అమరావతి: తన వ్యాఖ్యలతో ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌, ఆయన అభిమానులపై విరుచుకుపడే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈసారి రూటు మార్చాడు. తాజాగా ట్విట్టర్‌లో మరో దుమారానికి తెరలేపాడు.

ఈసారి కత్తి మహేష్ టార్గెట్ ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అవును, గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటనలో.. ఏపీ ఎంపీలపై ఆయన విమర్శలు గుప్పించాడు. ''ప్రకటన: ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికి చేవగల ఎంపీలు కావాలెను..'' అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

 Mahesh Kathi Sensational Comments on Andhra Pradesh MPs

సహజంగానే నెటిజన్లు ఈ పోస్టుపై స్పందించారు. ఓ నెటిజన్ 'చేవ' అంటే ఏమిటని ప్రశ్నించగా... ''పార్లమెంట్‌లో గొంతు విప్పి రాష్ట్రం కోసం పోరాడటం చేతనవ్వాలి.. అదే చేవ..'' అని కత్తి మహేష్ సమాధానమిచ్చాడు.

దీంతో కొంతమంది నెటిజన్లు.. ''అదేదో మీరే స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబడి ప్రయత్నించవచ్చు కదా?'' అని సూచించగా, మరికొందరేమో ఆయనపై విమర్శలు గుప్పించారు. మరి కత్తి మహేష్ తాజా కామెంట్స్‌పై ఏపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+