సెలవులు, దసరా రిజర్వేషన్ల పై బిగ్ అప్డేట్ - ప్రధాన రైళ్లల్లో ఇలా..!!

ఈ నెలలో వరుస సెలవులు ఉన్నాయి. అదే విధంగా దసరా పండుగ వేళ ప్రయాణాల కోసం పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో రైళ్లు నిండుకుంటాయి. ఈ సారి ఇప్పటికే రిజర్వేషన్లు ప్రారంభం కాగా పలు రైళ్లల్లో రిగ్రెట్ స్టేటస్ కనిపిస్తోంది. మరి కొన్ని రైళ్లల్లో పండుగ చివరి మూడు రోజులకు భారీ వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ తేదీల్లో అదనపు రైళ్ల కోసం ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

ఈ నెలలో వరుస సెలవులు ఉన్నాయి. రాఖీ, గణేష్​ చతుర్థి ఆ తరువాత దసరా నవరాత్రులు ఇలా పండుగలు ఉన్నాయి. దసరా పండుగకు నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు ప్రయాణాలకు పలువురు సిద్ధమవుతున్నారు. అక్టోబరు 2న దసరాను పురస్కరించుకుని సెప్టెంబరు ఆఖరి వారం నుంచి ప్రయాణానికి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అయితే అలాంటి వారిపై అప్పుడే రిజర్వేషన్ల ప్రభావం పడింది. దసరా కోసం చాలా మంది సెప్డెంబరు 28, 29, 30 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఆ 3 రోజులూ చాలా రైళ్లలో రిజర్వేషన్​ పూర్తయి పోయింది. వందల సీట్లు వెయిటింగ్ లిస్టులో కనిపిస్తోంది.

main-trains-reservations-filled-for-dasara-season-demands-for-special-trains

ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా కోల్​కతా వరకు వెళ్లే ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ సెప్టెంబర్ 28న వెయిటింగ్ లిస్టు ఉంది. ఆ రోజు మినహా 23 నుంచి 30 తేదీ వరకు రిగ్రెట్​ కనిపిస్తోంది. చర్లపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కటక్​, ఖరగ్​పూర్​, గువాహటి మీదుగా సిల్చర్ వెళ్లే ఎక్స్​ప్రెస్​ కూడా వచ్చే 27న రిగ్రెట్​ కనిపిస్తోంది. కోణార్క్, విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎల్‌టీటీ, పుణె-భువనేశ్వర్, నారాయణాద్రి, శబరి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు భారీగా ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేవారు రిజర్వేషన్‌ కోసం భారీ సంఖ్యలో ప్రయత్నిస్తున్నా ప్రయాణ తేదీ, రైలును సర్దుబాటు చేసుకుంటూ ముందస్తు రిజర్వేషన్లకు సిద్దం అవుతున్నారు.

గతేడాది పండుల దృష్ట్యా రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రయాణికుల దృష్ట్యా పలు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. లక్షలాది మంది ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చింది. ఇటు రెండు రాష్ట్రాల ఆర్టీసీలు సైతం దసరాకు రైల్వే రద్దీకి అనుగుణంగా తమ ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. దసరా వేళ రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. అయితే, ఛార్జీల విషయం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మహాలక్ష్మి పథకం కారణంగా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నెల చివరి వారంలో ఆర్టీసీ దసరా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+