తల్లికి వందనం నిధుల్లో బిగ్ ట్విస్ట్ - రైతు భరోసా కోసం ఇలా..!!

AP Budget 2025-26: 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 22 వేల 359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు చేసారు. బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం 251162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33185 కోట్లు ఉంది. ద్రవ్య లోటు 79926 కోట్లు ఉంది. మూల ధన వ్యయం 40635 కోట్లు గా ఉంది. ఇక, గత ప్రభుత్వ ఆర్దిక నిర్వహణా లోపాలను ప్రస్తావిస్తూ.. తమ ముందు ఉన్న సవాళ్లను కేశవ్ సభలో వివరించారు. ముఖ్యంగా తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు.

తల్లికి వందనం కేటాయింపులు
ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పథకం కోసం ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసారు. 2025-26 ఆర్దిక సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం రూ 9,407 కోట్లను ప్రతిపాదించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికి రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మే నెలలో ఈ పథకం కింద నిధులు జమ చేయనుంది. ఇందు కోసం ఈ బడ్జెట్ లో రూ 9,407 కోట్లు ప్రతిపాదన చేసారు. దాదాపు గా రూ 11 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు తొలుత అంచనా వేసారు. కాగా, మార్గదర్శ కాల తరువాత లబ్ది దారుల సంఖ్య.. ఖర్చు పైన స్పష్టత రానుంది.

Major Allocations for Super Six Schemes in AP Budget 2025-26 details here

అన్నదాత సుఖీభవ
బడ్జెట్ లో ఈ మేర నిధులు కేటాయింపు చేయటంతో కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలో ఈ నిధుల ను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300 కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి ఈ పథకం అమలు కానుంది. కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించి.. రాష్ట్రం హామీ ఇచ్చిన 20 వేలలో మిగిలిన రూ 14 వేలను మూడు సార్లు గా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Take a Poll

పెన్షన్ల కోసం
ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఈ కేటాయింపులు చేసారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. ఇక, బడ్జెట్ లో పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. పలు ప్రాజెక్టుల కోసం రూ 11,314 కోట్లను కేటాయిస్తున్న తన ప్రసంగంలో కేశవ్ వెల్లడించారు. సంక్షేమంతో పాటుగా హామీ ల అమలు దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కేశవ్ చెప్పుకొచ్చారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+