తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. రెండు బోగీలు దగ్ధం..!

తిరుపతి రైల్యే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. రైలు బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. బీమాస్ హోటల్ వెనక భాగంలో ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్‌ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో రెండు బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Major Fire Breaks Out at Tirupati Railway Station in Two Coaches of Hisar-Tirupati Train

తిరుపతిలోని రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ ఎక్స్ ప్రెస్ లోని రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. హిస్సార్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి రైల్వేస్టేషన్‌ కు వచ్చి ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్లే క్రమంలో ఇంజిన్‌ వెనకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనపై ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ లో ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే రైళ్లు కానీ.. స్టేషన్ కు వచ్చే రైళ్లు కానీ ఎలాంటి ఆలస్యం లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+