ఏపీ మద్యం స్కాంలో భారీ ట్విస్ట్..! అక్రమ సొమ్ము 6 కోట్ల చోరీ....!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అధికారులకు ఓ షాకింగ్ వ్యవహారం తెలిసింది. ఈ కేసులో నిందితులు దాచిన డబ్బులో కొంత భాగం ఒడిశా ముఠా కొట్టేసినట్లు తెలిసింది. అంతే కాదు ఈ డబ్బుతో ఆ ముఠా స్తిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇప్పుడు లిక్కర్ స్కాం నిందితులతో పాటు ఒడిశా గ్యాంగ్ పైనా ఫోకస్ పెట్టాల్సి వస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించిన పలువురు నిందితుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇందులో ఏ1 రాజ్ కెసిరెడ్డితో పాటు, ఏ9 కిరణ్ కుమార్ రెడ్డి మద్యం స్కాం డబ్బుల్ని పలు చోట్ల డెన్ లు ఏర్పాటు చేసి దాచారు. ఇలా దాచిన వాటిలో ఏ41గా ఉన్న సైమన్ ప్రసన్నకు బావమరిది అయిన ఏ44 మోహన్ కొల్లిపురి ఇల్లు కూడా ఉంది. ఈ మోహన్ అన్న అనిల్ కుమార్ కు అప్పట్లో కాలు విరగడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి ఇతని ఇంట్లోనే ఉన్నారు.

దీంతో అనిల్ ప్రియురాలు, ఒడిశాకు చెందిన రష్మిత బెహరా కూడా అక్కడికి వచ్చేది.ఆమె మద్యం స్కాం డబ్బులు వీళ్లు దాచడం చూసి ఒడిశాలో తన మరో ఫ్రెండ్ ఇర్షాద్ కు ఫోన్ చేసింది. వీరిద్దరూ కలిసి ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఇలా కటక్ నుంచి వచ్చిన ఇర్షాద్, హైదరాబాద్ లో ఉన్న మరొకరు ముబారక్ అలీని కలుపుకుని మొత్తం ఆరుగురు ఆరు పెట్టెల్లో దాచిన 5.8 కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత ముబారక్ అలీ ఇంట్లో పెట్టిన వీటిలో రెండు పెట్టెల్ని అతను కొట్టేశాడు. మిగిలిన 4 పెట్టెలు ఇర్షాద్ కు ఇచ్చాడు. వాటిని తీసుకుని అతడు రష్మిత బెహతాతో కలిసి ఒడిశా పారిపోయాడు.

ఈ ఘటన జరిగాక మద్యం స్కాం నిందితులు డబ్బు పోగొట్టిన సైమన్ ప్రసన్న, మోహన్ లతో వారి బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టించి డబ్పులు వసూలు చేసుకున్నారు. తాజాగా మద్యం స్కాం దర్యాప్తులో భాగంగా మోహన్ సోదరుడు అనిల్ కుమార్ దీన్ని బయటపెట్టాడు. కొట్టేసిన డబ్బుతో దొంగతనం చేసిన వారు ఆస్తులు కూడా కొన్నారు. దీంతో వాటిని జప్తు చేసేందుకు ఇప్పుడు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. అలా మద్యం స్కాం డబ్బులు కాస్తా దీంతో సంబంధం లేని వారికి చిక్కి స్తిరాస్తులుగా కూడా మారిపోయాయి.
సుప్రీం జారీ చేసిన ధిక్కరణ నోటీసు పైన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ సమయంలో స్పీకర్ కు నిర్దేశించారు. ఇదే సమయంలో సీరియస్ వ్యాఖ్యలు చేసారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే స్పీకర్ అనర్హత ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన మాత్రం ఆధారాలు బలంగా ఉన్నాయని..ఆ ఇద్దరూ రాజీనామా చేయక తప్పదనే వాదన వినిపిస్తోంది. కాగా, మిగిలిన ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ వివరణ తీసుకున్నారు. సుప్రీం ఇచ్చిన గడువు ముగియటం తో.. ఇప్పుడు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక.. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని హామీ ఇవ్వటంతో.. స్పీకర్ వీరి విషయంలో తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
Dry Day: మందు బాబులకు షాక్.. వాహనదారులకు అలర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications