• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయనపై కేసులు పెట్టండి.. బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయండి : వర్ల రామయ్య

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ పై అలాగే వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లుగా మొరగడం మానుకోకపోతే క్షమించేది లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. ఇక లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి బొంగరంలా తిరుగుతున్న ఏ2 ను కట్టడి చెయ్యాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు .

 లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విజయసాయిపై కేసులు పెట్టండి

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విజయసాయిపై కేసులు పెట్టండి

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి దేశవిదేశీ మేథావులతో చర్చించి కేంద్రానికి,రాష్ట్రానికి సలహాలు ఇస్తున్న చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు చేసిన సూచనలు తీసుకోవాలని చెప్పారు . ఏపీలోను , ఇంకా పొరుగురాష్ట్రాల్లో యధేచ్చగా తిరుగుతున్న విజయసాయి రెడ్డిని క్వారంటైన్ లో 14 రోజులు ఉంచాలని వర్ల రామయ్య రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు . విజయవాడ, విశాఖ,చెన్నై, హైదరాబాద్ లలో రోజుకొకచోట దర్శనమిస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై కేసులు నమోదు చేయాలని కూడా వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ష్టారాజ్యంగా చక్కర్లు కొడుతున్న విజయసాయి రెడ్డిని క్వారంటైన్ పంపండి

ష్టారాజ్యంగా చక్కర్లు కొడుతున్న విజయసాయి రెడ్డిని క్వారంటైన్ పంపండి


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ సింగ్ తన తండ్రి ఆనంద్ సింగ్ ఢిల్లీలో చనిపోతే కూడా వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ ఏం పని లేకున్నా విజయసాయి రెండు రాష్ట్రాలు తెగ తిరుగుతున్నారని మండిపడ్డారు .రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇష్టారాజ్యంగా చక్కర్లు కొడుతున్న విజయసాయిరెడ్డిని అసలు నీకు ఇప్పుడేం పని అని వర్ల నిలదీశారు. దేశమంతా లాక్ డౌన్ ను తూచా తప్పక పాటిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటే విజయసాయి ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు . వయస్సు మళ్ళిన వారు రక్తదానం చెయ్యకూడదు అన్న నిబంధనలను సైతం విజయసాయి ఎలా అతిక్రమిస్తారని ప్రశ్నించారు.విజయసాయి రెడ్డిని తక్షణం క్వారంటైన్ లో 14 రోజుల పాటు నిర్బంధించి కరోనా టెస్టులు నిర్వహించి నెగిటీవ్ అని నిర్ధారణ అయిన పిమ్మటే రాష్ట్రంలో తిరగనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి వర్ల సూచించారు.

Recommended Video

Watch : లాక్ డౌన్ లో రోడ్లపై తిరిగే వాళ్ళకి కొత్త పద్ధతిలో బుద్ధి చెప్తున్న మహారాష్ట్ర పోలీసులు!
 ఆయనను సీఎం జగన్ సామంత రాజుగా నియమించారా?

ఆయనను సీఎం జగన్ సామంత రాజుగా నియమించారా?


బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయాలని ట్విట్టర్ వేదికగా కూడా సూచించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని సీఎం జగన్ సామంత రాజుగా నియమించారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘ముఖ్య మంత్రి గారు! విశాఖ జిల్లాలో అంతా తానై, లాక్ డౌన్‌ను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డిని మీ సామంత రాజుగా నియమించారా? రాజ్యసభ సభ్యుడిని మాత్రమే అన్న సంగతి మరచి, మంత్రులను కాదని బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయండి. ఆయన బయట తిరిగితే, పోలీసులు కూడ లాటీలు ఝుళిపించాలి'' అని ట్వీట్ చేశారు.

English summary
TDP leader Varla Ramaiah has urged the state government to keep Vijayasai Reddy in the quarantine for 14 days, which is a frequent roaming in AP and neighboring states. ramaiah fired on vijayasai activities during the lock down period . he demanded to file cases against vijayasai reddy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X