'కావాలనే చేస్తున్నారు, వెంకయ్య పంచెలూడదీసి కొడతాం, బాబుకు బుద్ధి చెప్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు పంచెలూ ఊడదీసి తరిమికొడతామని మాల మహానాడు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు.

తలనొప్పేంటి, అంతా తెలుసు, సారీ చెప్పండి: బాబు ఆగ్రహం, ముందే రిపోర్ట్..

ఆదివారం నెల్లూరులో జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో మాట్లాడారు. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.

Mala Mahanadu wanrs Venkaiah Naidu

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టిడిపి నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు.

మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mala Mahanadu wanrs Union Minister and BJP Leader Venkaiah Naidu over sc categorisation.
Please Wait while comments are loading...