ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు డిసెంబర్ 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో కలిసి మాలకొండయ్య శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.
మాలకొండయ్య జనవరి 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య.. గుంటూరు జిల్లా ఎస్పీ, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications