సింహవాహనంపై మలయప్ప స్వామి.. నేడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇలా!!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరం అత్యంత ఘనంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహోమోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కాగా, తొలి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ పై తిరుమల పవిత్రత పైన వివాదం కొనసాగుతున్న వేళ శ్రీవారి బ్రహోత్సవాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ముఖ్యంగా శ్రీవారి బ్రహోత్సవాలలో అన్న ప్రసాదంపైన, అలాగే ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తొలి రోజు శ్రీవారి పెద్దశేష వాహనం పైన స్వామి వారు ఊరేగారు.

Malayappa Swamy on simha vahanam Tirumala Srivari Salakatla Brahmotsavam third day

మలయప్ప స్వామికి విశేష సేవలు
పెద్ద శేష వాహనం పైన పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్య స్వామి భక్తులకు అభయమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు శనివారం ఉదయం స్వామి చిన్న శేష వాహనం పైన మురళీకృష్ణుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మలయప్ప స్వామికి హంస వాహన సేవ
ఆపై శనివారం రాత్రి హంస వాహనం పైన స్వామివారి ఊరేగి భక్తులను కరుణించారు. హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులలో అంగరంగ వైభవంగా హంస వాహన సేవ జరిగింది. వివిధ కళాబృందాల ప్రదర్శనలతో హంస వాహన సేవలో మలయప్ప స్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశించాడు.

నేడు సింహ వాహనంపై మలయప్ప స్వామి
ఇక నేడు మూడవరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మల్లయ్య స్వామి సింహ వాహనం పైన మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు వాహనసేవ జరగనుంది. ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రతిరోజు విభిన్న కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. కాగా శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన శ‌నివారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+