వచ్చేస్తున్న 'ఎవర్సెండై'.. ఏపీకి మలేషియా బడా కంపెనీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే టార్గెట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే పలు దిగ్గజ కంపెనీలతో సీఎం వరుసగా భేటీ అవుతున్నారు. ఈ తరుణంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మలేసియాకు చెందిన ఎవర్సెండై కార్పొరేషన్ (Eversendai Corporation) ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

గతంలో చేసిన నిర్మాణాలు..

ఎవర్సెండై సంస్థ గతంలో ఫ్యాబ్రికేషన్‌ పనులు నిర్వహించిన ప్రాజెక్టుల్లో.. బుర్జ్‌ ఖలీఫా (దుబాయ్), పెట్రోనాస్ టవర్ (మలేసియా) ఉన్నాయి. అలానే చెన్నైలోని డీఎల్‌ఎఫ్‌ డౌన్‌టౌన్‌ తారామణి ప్రాజెక్టు, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పుడు ఈ సంస్థ రాష్ట్రంలోకి రాబోతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

malaysian-company-eversendai-going-to-invest-in-ap

విశాఖ - కృష్ణపట్నంలో పెట్టుబడి..

ఎవర్సెండై కార్పొరేషన్ సీఎండీ తాన్‌శ్రీ ఎ.కె. నాథన్ సింగపూర్‌లో సీఎం చంద్రబాబును కలసి ప్రతిపాదనలపై చర్చించారు. విశాఖ లేదా కృష్ణపట్నంలో 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్‌ ఫ్యాక్టరీ.. అలాగే సమీకృత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశవ్యాప్తంగా ఫ్యాబ్రికేషన్‌ ఉపకరణాలను రవాణా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

అలాగే అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలన్న ఆలోచన కూడా ఉందని వెల్లడించింది. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే అంశంపై కూడా ముఖ్యమంత్రితో చర్చలు జరిపినట్టు సమాచారం.

మరోవైపు తన పర్యటనలో భాగంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే.. తెలుగు వ్యక్తి చేశాడని అంటారని.. అందువల్ల మొత్తం తెలుగు ప్రజల ప్రతిష్ఠ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. 2019లో వైసీపీ సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సంబంధాలను పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకోండి..

ప్రపంచవ్యాప్తంగా 128కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని.. అందులో 40 వేల మంది సింగపూర్‌లో ఉన్నారని సీఎం వెల్లడించారు. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్ముతో ఎదిగిన మీరు.. ఇప్పుడు మీ జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్నారు. పీ4 కార్యక్రమం ద్వారా పేదరికాన్ని తగ్గించే మిషన్ ప్రారంభించామని.. మీ గ్రామాల్లో పేదలను దత్తత తీసుకోండి'' అని చంద్రబాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+