వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్లాది విష్ణుకు కీలక పదవి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఉాషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కశ్యప పెన్షన్లు, భారతీ స్కీమ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మల్లాది విష్ణు తెలిపారు.

Malladi Vishnu Appointed AP Brahmin Corporation Chairman

బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణులకు అన్యాయం చేసిందని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.

బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వంశపారంపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు, ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక నిధులు ఇచ్చారని చెప్పారు. కాగా, మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.

English summary
The state government appointed Vijayawada central MLA Malladi Vishnu as Chairman for Andhra Pradesh Brahmin Corporation. the orders were issued to this effect on Friday. Vishnu's supporters expressed their happiness over his appointment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X