వైసిపిలోకి మల్లాది విష్ణు, అందుకే: దీటుగా జగన్ 'ఆపరేషన్'
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లాది విష్ణు
విజయవాడ: ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లాది విష్ణు జగన్ పార్టీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం విష్ణు కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన త్వరలో వైసిపిలో చేరనున్నారని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన తన అనుచరులు, వైసిపి నేతలతో చర్చించారని తెలుస్తోంది.
అందుకే జగన్ వైపు మల్లాది విష్ణు
ఈ నెల 8, 9 తేదీలలో విజయవాడలో జరిగి ప్లీనరీ సమావేశంలో వైసిపి అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. విభజన నేపథ్యంలో 2019 వరకు కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోదనే వాదనలు వినిపిస్తున్నాయి.

వైసిపి, టిడిపిల మధ్యే పోటీ ఉంటుందని, ఆ తర్వాత జనసేన, బిజెపిల ప్రభావం కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వైసిపిలో చేరనున్నారని తెలుస్తోంది.
కాగా, వైసిపిలో చేరుతున్నారనే ప్రచారంపై మల్లాది విష్ణు స్పందించారు. మీడియానే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికలకు టిడిపి, వైసిపిలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. దీంతో జగన్ పార్టీ కొంత బలహీనపడింది.
పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల టిడిపిలోని అసంతృప్తులను, ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై జగన్ కన్నేశారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డిని ఇటీవలే టిడిపి నుంచి తన పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జగన్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు.












Click it and Unblock the Notifications