దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి కన్నకూతురుపై తండ్రి అత్యాచారం

చిత్తూరు: జిల్లాలోని ఐరాల మండలంలోని ఓ దళితవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 12ఏళ్ల బాలికపై ఆమె కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ కథనం ప్రకారం.. ఓ వ్యవసాయ కూలీ(43) తరచూ కుమార్తెను పంట పొలాల్లోకి తీసుకెళ్లేవాడు. మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు.

గత ఆదివారం మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక తప్పించుకొని తన తల్లికి విషయం చెప్పింది. దిక్కుతోచని ఆ తల్లి కుమార్తెను తీసుకుని పక్క గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకెళ్లిపోయింది. వారిచ్చిన ధైర్యంతో ఐరాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన సీఐ.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

rape

డబ్బు కోసం అన్నను చంపిన తమ్ముడు

డబ్బు కోసం వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. కాళ్లు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కడపలోని చెమ్ముమియాపేటకు చెందిన పగడాల అశోక్(27) రాయంపేటలోని మహేంద్ర ట్రాక్టర్స్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గత శనివారం అతని ఇంటికి వచ్చిన పెదనాన్న కుమారుడు నరేష్ పని ఉందని బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అశోక్ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు సోమవారం తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా నరేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తన భార్యతో విడాకులు తీసుకునేందుకు డబ్బు అవసరముండటంతో అశోక్‌ను డబ్బులు అడిగానని.. అందుకు అతను నిరాకరించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకన్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+