హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వక్స్ బోర్డు స్దలాలు కబ్జా, అరెస్టు చేసి రిమాండ్‌కు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వక్ఫ్ బోర్డు స్దలాలు కబ్జా చేస్తున్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మంగళవారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్ స్పెక్టర్ మోహన్ కుమార్, ఎస్సై మాన్ సింగ్ తెలిపివ వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్ సఫిల్ గూడాకు చెందిన మీర్ ఖుమర్ హసన్ రజ్వీ అలియాస్ ఖుమర్ (54) మత బోధకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వక్భ్ బోర్డు స్దలాల్లో షియా వర్దీయులకు వాటా ఉంటుందని స్దలాలు కబ్జా చేస్తుంటాడు.

Man arrest grabbing of wakf board land in Hyderabad

గతంలో ఇతనిపై మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయని అన్నారు. గత నెల 27న బేగంపేటలోని 2100 గజాల స్దలాన్ని ఖుమర్‌తో పాటు కొందరు వచ్చి చదువు చేశారు.

విషయం తెలుసుకున్న వక్స్ బోర్డు ఆడిట్ ఇన్ స్పెక్టర్ అహ్మాద్ బాషా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఖుమర్‌ను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

English summary
Man arrest grabbing of wakf board land in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X