హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ డబ్బులు అడిగినందుకు గొడ్డలితో దాడి, మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కడపలో అశోక్ లాడ్జి వద్ద దారుణం చోటు చేసుకుంది. టీ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి గొడ్డలితో టీ దుకాణం యజమానిపై దాడి చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీ దుకాణం యజమాని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడికి కోసం గాలిస్తున్నారు.

ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐషర్ వాహనం

అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో ఆర్టీసీ బస్సు, ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.

Man attacked for asking tea money in kadapa

రేబీస్ వ్యాధితో గుంటూరులో చిన్నారి మరణం

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పుష్షలత (5) రేబీస్‌తో మృతి చెందింది. జనవరి మొదటి వారంలో బాలికను పిచ్చి కుక్క కరవడంతో ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. అభయ్‌ర్యాబ్‌ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబీస్‌ సీరమ్‌ (ఇమ్యునో గ్లోబిలిన్‌) కూడా ఇచ్చారు.

ఆయినా పది రోజుల తర్వాత బాలికలో రేబీస్‌ వ్యాధి లక్షణాలు కనిపించి, జనవరి 23న మృతి చెందింది. జనవరి నెలలో ఏకంగా 27 మంది పిల్లలు చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌ శిశు వైద్య విభాగంలో చేరారు. వీరందరికీ అభయ్‌ర్యాబ్‌ వ్యాక్సిన్‌తో పాటు ఈక్వైన్‌ యాంటీ ర్యాబీస్‌ సీరమ్‌ (ఇమ్యునో గ్లోబిలిన్‌) ఇస్తున్నారు.

English summary
Man attacked for asking tea money in kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X