సినీ ఛాన్స్ పేరిట గర్ల్‌కి డ్రింక్ ఇచ్చి, అమ్మాయిల్నిచూసి..

హైదరాబాద్: సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని ఓ వ్యక్తి ముంబైకి చెందిన ఓ యువతిని మోసం చేసి, ఆమె వద్ద డబ్బు, నగలు దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకున్నారు. వివరాలను ఇన్స్‌పెక్టర్ గురువారం వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రభ గుప్తాకు జీతు అనే వ్యక్తి పరియచమయ్యాడు. తెలుగు సినిమాలలో అవకాశం ఇప్పిస్తానని, అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పాడు. తనకు తెలిసిన వ్యక్తి హైదరాబాదులో ఉన్నాడని నగరానికి తీసుకు వచ్చాడు.

Man cheated girl with the name of cinema chance

హైదరాబాదు వచ్చిన తర్వాత అతని స్నేహితుడు అవకాశాలు లేవని చెప్పాడు. ఆ తర్వాత ఆమెను కారులో ముంబై తీసుకెళుతూ.. మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, రూ.15వేలు తీసుకొని రైల్వే స్టేషన్లో వదిలేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

రియల్టర్ చేతిలో రివాల్వర్ మిస్‌ఫైర్

హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో ఓ రియల్టర్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో రియల్టర్ ముత్యాల రమేష్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రమేష్ తనకు ప్రాణహానీ ఉందంటూ గత ఏడాది రివాల్వర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాడు.

ఈ నేపథ్యంలో తనకు పెళ్లి సంబధాల కోసం షాదీడాట్ కామ్ ఆఫీసుకు వెళ్లగా అక్కడ అమ్మాయిలను చూసి ఒక్కసారిగా రివాల్వర్‌ను ప్రదర్శించాడు. దీంతో రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. సమాచారం అందుకు పోలీసులు అక్కడకు చేరుకుని రివాల్వర్‌తో పాటు ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వాసిగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+