యువతిని ప్రేమించాడు, ఆ తర్వాత మరదలితో పారిపోయాడు

చిత్తూరు: తిరుపతిలో ఓ వ్యక్తి దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని ప్రేమించి ... ఆ తర్వాత మరదలితో పారిపోయిన సంఘటన జరిగింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉషారాణి అనే యువతిని ప్రేమించాడు. వారిద్దరు ప్రేమించుకున్నారు.

వారు ఓ చిన్నారికి జన్మను ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు.. తాను అనంతపురం వెళ్తున్నానని చెప్పి చంద్రశేఖర్ వెళ్లిపోయాడు. అయితే, నాలుగు నెలలు గడిచినా తిరిగి రావడం లేదు.

ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉషకు ఫోన్ చేసి.. తనకు తన మరదలితో పెళ్లి కుదిరిందని షాకిచ్చాడు. అయితే, ఆ తర్వాత బాధితురాలు ఫోన్ చేస్తే అది పని చేయలేదు. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Man cheats woman with love marriage

సినీ ఫక్కీలో..

పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం సినీ ఫక్కీలో ఓ కిడ్నాప్ జరిగింది. ఆ కిడ్నాప్‌ను గ్రామస్తులు కూడా చేధించారు. కిడ్నాపర్లు తమను పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చేలోగా ఇద్దరు కిడ్నాపర్లు తప్పించుకుని పారిపోగా, ఓ కిడ్నాపర్ పట్టుబడ్డాడు.

ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేశాడన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న దెందులూరు మండలం కొవ్వలి వాసి సతీశ్ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. అయితే అకస్మాత్తుగా అక్కడికి దూసుకు వచ్చిన ఓ వాహనంలోని ముగ్గురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు.

తమ వాహనంలోకి ఎక్కించుకుని పరారయ్యేలోగా సతీశ్ తప్పించుకున్నాడు. దీనిని గమనించిన గ్రామస్తులు కిడ్నాపర్ల పైన తిరగబడ్డారు. కిడ్నాపర్లను పట్టుకుని గ్రామస్తులు చితకబాదారు. పోలీసులకు సమాచారమందించారు. ఒక కిడ్నాపర్ పట్టుబడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+