భార్య ఎదుటే పరాయి స్త్తీలతో కామకేళీలు: వ్యక్తి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: భార్య ఎదుటే ఇంట్లో పరాయి స్త్రీలో కామకేళీ జరిపేవాడు. తన విలాసాలకు అడ్డు వస్తోందని చివరకు ఆమెను చంపాలని కూడా అనుకున్నాడు. కానీ, చివరకు అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని కమాన్ ప్రాంతానికి చెందిన ఎండి సాదిక్ (68) ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో హైదరాబాదు పాతబస్తీకి చెందిన నస్రీన్ మల్లికను రెండో వివాహం చేసుకున్నడాు. గొత కొంత కాలంగా భార్య కళ్ల ముందే పరాయి స్త్రీలను ఇంటికి తీసుకుని వచ్చి శారీరకవాంఛలు తీర్చుకోవడం ప్రారంభించాడు.

 A man died in hyderabad, who planned kill wife

ప్రశ్నిస్తే భార్యను కొట్టడంతో పాటు చంపుతానని బెదిరించేవాడు. దానికితోడు, రోజూ అన్నంలో, మంచినీళ్లలో, కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసి ఆమెకు ఇచ్చేవాడు. ఆమె నిద్రమత్తులో ఉండగా పరాయి స్త్రీలను ఇంటికి తీసుకుని వచ్చేవాడు. అదే క్రమంలో మంగళవారం తెల్లవారు జామును రెండు గంటల ప్రాంతంలో ఓ యువతిని ఇంటికి తీసుకుని వచ్చాడు. దానికి భార్య అడ్డు చెప్పింది.

దాంతో నస్రీన్‌పై సాదిక్ కత్తితో దాడికి దిగాడు. ఆమె భయంతో భర్తను బెడ్రూంలోకి నెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతోల పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తుండగానే సాదిక్ కుప్పకూలిపోయాడు. అప్పటికే అతను మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+