థమ్సప్ తాగి ఆసుపత్రి పాలయ్యాడు, 'ఇంద్ర' బస్సు దగ్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో షాకింగ్ అంశం వెలుగు చూసింది. ఓ వ్యక్తి థమ్సప్ తాగి ఆసుపత్రి పాలయ్యాడు. అందులో పాదరసం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిని లేబోరేటరీకి పంపించారు. రిపోర్టు వచ్చాక అందులో ఏం కలిసుందో తెలియనుంది.
విజయవాడకు చెందిన రామ్మోహన్ అనే బాధితుడు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు థమ్సప్ తాగాడు. అతను తాగిన థమ్సప్‌లో ఏదో ద్రావణం కలిసిందని అంటున్నాడు. అదే సమయంలో అతను అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు.

వైద్యులు ఆ థమ్సప్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే, అందులో పాదరసం కలిసిందని బాధితుడు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పాదరసం కలిసినందువల్లే అతను ఆసుపత్రి పాలయ్యాడా, లేక అందులో ఇంకేమైనా కలిసిందా తెలియాల్సి ఉంది.
విజయవాడలో దగ్ధమైన ఇంద్ర బస్సు
విజయవాడలో ఇంద్ర బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై ఈ బస్సు దగ్ధమైంది. బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదపు చేశారు. బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.












Click it and Unblock the Notifications