రైల్వే ట్రాక్‌పై శవం: ఆస్తి కోసం బావనే చంపాడు
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్కపల్లి గ్రామంలో ఆస్తి కోసం సొంత బావమరిదినే ఓ వ్యక్తి హత్య చేశాడు. ఎల్కపల్లి గ్రామం లక్ష్మీపురం రైల్వే గేటుకు చెందిన మిట్లపల్లి చంద్రశేఖర్ (25) గత నెల 26వ తేదీ నుంచి కనిపించడం లేదు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రశేఖర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని రైల్వే పోలీసులు కుందనపల్లి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద కనుక్కున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు శవాన్ని పరిశీలించి, మరణించిన వ్యక్తిని చంద్రశేఖర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్ బావ సంపత్‌ను కూడా విచారించారు. అయితే, తనకు ఏమీ తెలియదని అతను బుకాయించాడు.
అయితే, పోలీసులు అతనిపై అనుమానంతో విచారణ సాగించారు. దాంతో తాను చేసిన నేరాన్ని సంపత్ అంగీకరించాడు. ఆస్తి కోసం తాను బావమరిది చంద్రశేఖర్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగు తిన్నారు. నిందితుడు సంపత్ను డిఎస్పీ మల్లారెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications