భార్య షికారుకు రాలేదనే కోపంతో వ్యక్తి ఆత్మహత్య

man kills himself as wife rejects to come with him
హైదరాబాద్: భార్య తనతో షికారుకు రావడానికి నిరాకరించడంతో ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో అతను ఆత్మహత్య చేసుకున్నడాు. ఈ సంఘటన హైదరాబాదులోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. కరీంనగర్ జిల్లా వంశీకృష్ణ (26) చిత్తూరుకు చెందిన హిమబిందును ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు.

వారిద్దరు కొంత కాలంగా దిల్‌షుక్‌నగర్‌లోని శారదానగర్‌లో కాపురం ఉంటున్నారు. వంశీకృష్ణ మెడికల్ రిప్రజెంటెటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారంనాడు హిమబిందు పుట్టిన రోజు కావడంతో ఇద్దరు కలిసి బయటకు వెళ్తామని భర్త ప్రతిపాదించాడు. ఇందుకు భార్య నికారించింది. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

భార్య మొండికేయడంతో మనస్తానికి గురైన వంశీకృష్ణ రాత్రి సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత భార్య తలుపు తట్టింది. తలుపులు తట్టినా ఫలితం లేకపోవడంతో ఆమె తన సోదరుడిని పిలిపించింది.

ఆమె సోదరుడు తలుపులు బద్దలు కొట్టి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉండడం కనిపించింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఆదివారంనాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+