పాఠశాలకు వెళ్లడం లేదని కన్న కొడుకుని చంపిన తండ్రి

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అజీజ్ ఖాన్ థానే జిల్లాలోని అంబేర్నాథ్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. తన కొడుకు సాజిద్ కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదని తెలిసిన అజీజ్ ఖాన్.. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించాడు.
సాజిత్ సమాధానాలతో సంతపృప్తి చెందని అజీజ్ ఖాన్ అతన్ని ఓ కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో సాజిద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన కుతున్‌బిన్ ఖాన్ పొరిగింటివారిని పిలవడంతో వారు బాలుడు సాజిద్‌ను హుటాహుటిన థానే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అందించిన వైద్యులు.. తీవ్ర గాయాలు కావడంతో ఆ బాలుడు గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు. దీంతో సాజిద్ నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన అజీజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసి, అతనిపై ఐపిపి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications