కారులో తిప్పుతూ, బిర్యానీ విషం ఇచ్చి భార్యాబిడ్డలను చంపేశాడు

కడప: తన భార్యాబిడ్డలను ఓ వ్యక్తి అత్యంత కుట్రపూరితంగా హతమార్చాడు. అనుమానం రాకుండా విషం కలిపిన బిర్యానీ తినిపించి వారిని పరలోకానికి పంపించాడు. నిజానికి, భార్యాభర్తలిద్దరు దశాబ్దానికిపైగా విడిగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే దగ్గరయ్యారు. భార్యని, కుమారుడిని వెంటపెట్టుకొని తిరుగుతూ మనిషి మారినట్లు కనిపించాడు.

అయితే, విషం కలిపిన బిర్యానీ తినిపించి భార్యాబిడ్డలను హతమార్చాడు. భార్య, కుమారుడు అదృశ్యమయ్యారంటూ రెండు నెలల పాటు నాటకం ఆడి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం - కడప పట్టణానికి చెందిన ఎన.నాగేశ్వరికి 2003లో స్థానిక అక్కాయపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌తో వివాహమైంది.

Also Read: కంగారూను మింగేసిన కొండచిలువ(వీడియో)

ముందు పాప , ఆ తరువాత కుమారుడు జన్మించాడు. ప్రణీతరాజ్‌ పుట్టిన నాటినుంచీ దంపతుల మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో కొడుకును తీసుకొని బయటకొచ్చింది. ప్రైవేట్‌ స్కూలులో పనిచేసుకొంటూ ఒంటరిగా జీవనం సాగిస్తూ వచ్చింది. చుట్టుపక్కల వారి సలహా వల్ల, ఇల్లు గడవడం కష్టమై ఈ మధ్య కాలంలో నాగేశ్వరి తిరిగి భర్త దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన చేసింది. మధ్యవర్తుల ద్వారా ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించింది.

Man kills wife and son in kadapa district

వారి సలహా మేరకు నెలకు కొంత ఆర్థిక సాయం చేసేందుకు ప్రవీణ్‌ అంగీకరించాడు. అతనిలో మరో ఆలోచన ఉందని ఎవరూ పసిగట్టలేకపోయారు. ఈ ఆలోచనతో తరచూ భార్య, కుమారుల వద్దకు వచ్చిపోతున్నాడు.

ఈ క్రమంలో గత డిసెంబరు 11వతేదీన నాగేశ్వరి, ప్రణీతలను కారులో ఎక్కించుకొని పట్టణమంతా తిప్పాడు. ఒక దగ్గర కారు ఆపి బిర్యానీ పార్సిల్‌ కట్టుకొని వచ్చాడు. దారిలోనే బిర్యానీలో విషం కలిపేశాడు. ఆ ఆహారాన్ని తీసుకొన్న కొద్దిసేపటికే తల్లీబిడ్డ కారులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ స్థితిలోనే కొన్ని గంటలపాటు పట్టణంలో కారులో తిరిగాడు.

Also Read: యస్! వాజపేయికి వెన్నుపోటు పొడిచా: నవాజ్ షరీఫ్

వారు చనిపోయారని నిర్ధారించుకొన్న తరువాత గోతం సంచుల్లో కట్టేసి కడప రిమ్స్‌ నుంచి పాలకొండ వైపు వెళ్లే దారిలో ఖననం చేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకుగాను, ‘నేను మరో వ్యక్తితో పోతున్నాను' అని ఆమె సెల్‌ఫోన్‌ నుంచి నాగేశ్వరి సోదరి రాజేశ్వరికి మెసేజ్‌ పెట్టాడు.

అప్పటినుంచి సోదరి ఆచూకి కోసం రాజేశ్వరి పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ దశలో నాగేశ్వరితోపాటు బాబు కూడా అదృశ్యమైయినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల అనుమానంపై ప్రవీణ్‌ను పిలిపి విచారించగా, నేరం అంగీకరించినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+