అఫైర్: భార్యనూ లవర్‌నూ హత్య చేసి లొంగుబాటు

man kills wife and another person
హైదరాబాద్: సికింద్రాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో జంటహత్యలు కలకలం తీవ్ర సంచలనం సృష్టించాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో భార్య, యువకుడిని భర్త రాకేష్ కత్తితో నరికి చంపాడు. అనంతరం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయారు.

మృతులు రాకేష్ భార్య జయశ్రీ (33), ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నారాయణలుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు గురైన యువకుడు బేగంపేటలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేష్ భార్యాపిల్లలతో కలిసి తాడ్‌బండ్‌లో నివాసం ఉంటున్నాడు. జయశ్రీ బేగంపేటలోని పాటిగడ్డ ప్రాంతానికి చెందిన నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఇటీవల తరుచుగా గొడవ జరుగుతోంది. దాంతో జయశ్రీ బోరబండలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

శనివారం ఉదయం రాకేష్ జయశ్రీ వద్దకు వెళ్లి ఇంటికి వెళ్దామని చెప్పి తాడ్‌బండ్‌లోని నల్లపోచమ్మ దేవాలయానికి జయశ్రీని తీసుకుని వచ్చాడు. అక్కడ ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత పాటిగడ్డ వెళ్లి నారాయణను హత్య చేశాడు.

హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+