భార్యను చంపి భర్త ఆత్మహత్య, తిరుపతిలో సైకో అరెస్టు

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల నడకదారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం తిరుపతి క్రైం బ్రాంచ్‌కు తరలించారు. ఈ నెల 19వ తేదీన తమిళనాడుకు చెందిన త్యాగరాజన్ దంపతులపై ఉన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే.
నిందితుడిని తమిళనాడులోని నాగపట్నానికి చెందిన దక్షిణామూర్తిగా గుర్తించారు. అతడు మరోసారి అలిపిరి కాలిబాటలో సంచరిస్తుండగా టిటిడి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవింద త్యాగరాజన్ దంపతులు కాలినడకన బయలుదేరినప్పుడు 25 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా దాడి చేశారు.












Click it and Unblock the Notifications