తాగడానికి డబ్బులివ్వలేదని భార్యను నరికి చంపాడు

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను ఓ తాగుబోతు డిమాండ్ చేశఆడు. ఆమె అందుకు నిరాకరించింది. దాంతో అప్పటికే తాగిన మత్తులో ఉన్న భర్త ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ పరిణామానికి భయపడిన మహిళ బయటకు పరుగులు తీసింది. ఆమెను అతను వెంబడించి నడి వీధిలో గొడ్డలితో ఆమెను నరికి చంపేశాడు.
తాగుబోతును అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications