• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో హత్య:భర్తను ప్రియుడి చేత భార్యే చంపించింది...ఎంత దారుణం అంటే!

By Suvarnaraju
|

తూర్పుగోదావరి:అమాయకుడైన భర్తను తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలసి చంపేయడమో, చంపించడమో చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్నాయి.

తాజాగా ఇటువంటిదే మరో దారుణం తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడికి, తనకు మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని ఆ భార్య...అదే ఆలోచనతో ఉన్న ఆమె ప్రియుడు ఒక పథకం ప్రకారం అతడిని దారుణంగా హతమార్చారు. చంపే క్రమంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న భర్తను సజీవంగానే పూడ్చి పెట్టారనే అనుమానం కూడా ఉంది. అంతేకాదు ఆ తరువాత వారు ఆడిన డ్రామాలు పోలీసులను సైతం విస్మయపరిచాయి. వివరాల్లోకి వెళితే...

ఎంత నాటకం...ఎంత దారుణం

ఎంత నాటకం...ఎంత దారుణం

నా భర్త ఏడీ?..నా భర్తను తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెట్టండి...అట్లాఅయితేనే నేను అన్నం తింటా?...ఎక్కడున్నాడో తీసుకురండి...అంటూ ఆమె...నా ఫ్రెండ్...నా అన్న...ఏమైపోయాడు నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వెళ్లడు...నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అంటూ అతడు...ఇలా పది రోజుల పాటు ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు...కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు...అలా పోలీసులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి వాళ్లను పరుగులు పెట్టిస్తూ ముచ్చెమటలు పట్టించేవాళ్లు.

అసలు...ఏం జరిగిందంటే?

అసలు...ఏం జరిగిందంటే?

కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబుకు ఏడాది కిందట పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతితో పెళ్లయింది. జ్యోతి పదో తరగతి చదువుతుండగానే ఆమె తల్లిదండ్రులు ఆమెను సత్తిబాబుకిచ్చి వివాహం చేశారు. అయితే అప్పటికే ఆమెకు దివిలి గ్రామానికి చెందిన చిక్కడాల రాజాతో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కూలిపని చేసుకునే సత్తిబాబు జ్యోతికి మొరటుగా అనిపించి భర్తంటే ఇష్టం ఉండేది కాదు. ఆ క్రమంలో ఈమె ఐటిఐ చదువుతున్న తన ప్రియుడు రాజాతో వెళ్లిపోవాలని...వీరిద్దరూ లేచిపోవాలని పలు మార్లు అనుకున్నారని పోలీసుల విచారణలో తెలిసింది.

అయితే...ప్లాన్ మారింది

అయితే...ప్లాన్ మారింది

అయితే అలా లేచి వెళ్లిపోతే లేనిపోని సమస్యలు...పైగా మూడు కుటుంబాలకు అవమానం...దాని వల్ల ఇబ్బందులు...ఇవన్నీ దేనికని...అసలు తమ సమస్యకు మూలమైన...తమ రాసలీలలకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతప్పిస్తే పోలా అనుకున్నారు. అందుకు చాలా పెద్ద ప్లానే వేశారు. ఈక్రమంలో ఆమెపై భర్తకు అనుమానం రాకుండా ప్రియుడే భర్తను ముందు స్నేహితునిగా చేసుకునేలా...ఆ తరువాత అనుమానం రాకుండా అంతమొందించేలా వెనకుండి కథను నడిపించింది. అదెలాగంటే...ఈమె ప్రియుడు రాజా ఆమె భర్తకు ముందుగా ఏదో మిషతో ముఖపరిచయం అయ్యాడు...ఆ తరువాత మెల్లిగా ఇంటికి రావడం మొదలుపెట్టి

తరుచూ వచ్చేవాడు. మరోవైపు జ్యోతి పలుమార్లు భర్తతో కలసి ప్రియుడు ఇంటికి వచ్చినా అతనెవరో అస్సలు తెలియనట్లే నటించేది. అలా కొంతకాలం స్నేహం సాగించిన రాజా సత్తిబాబుకు తరుచూ బాగా మద్యం తాగించేవాడు.

 ఆ తరువాత హత్య...ఇలా

ఆ తరువాత హత్య...ఇలా

ఆ క్రమంలో గత నెల 19వ తేదీన రాత్రి ముక్కొల్లు గ్రామంలో ఇంటినుంచి బయలు దేరిన సత్తిబాబు తనస్నేహితుడిని కలిసేందుకు దివిలి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయలుదేరాడు. ఆ విషయాన్ని ఆమె ప్రియుడు రాజాకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. ఈ మేరకు సత్తిబాబును చంద్రమాంపల్లిలో కలిసిన రాజా దివిలిలోని మద్యం దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాగా తాగించి జి.రాగంపేట, దివిలి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులతో కలిసి ఇనుపరాడ్డుతో సత్తిబాబు తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మోటారు సైకిల్‌పై చంద్రమాంపల్లి తీసుకొచ్చి అప్పటికే సిద్ధంచేసుకుని ఉంచిన పాఠశాల వెనక గోడను ఆనుకుని తీసిన గోతిలో పూడ్చిపెట్టారు. అయితే అప్పుడు సత్తిబాబు ఇంకా సజీవంగానే ఉన్నాడని, కోమాలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

సత్తిబాబు అదృశ్యం...డ్రామాలు...అరెస్ట్

సత్తిబాబు అదృశ్యం...డ్రామాలు...అరెస్ట్

అలా మచ్చా సత్తిబాబు ఈ ఏడాది జూన్ 19వ తేదీన అదృశ్యమయ్యారు. 22వ తేదీ వరకు ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో జూన్ 26వ తేదీన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అదిగో...ఇక అప్పటినుంచే పైన వర్ణించిన తీరులో ఇటు భార్య...అటు ఆమె ప్రియుడు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశారు...అయితే వీళ్ల ఓవర్ యాక్షనో...లేక ఏదైనా సమాచారం తెలిసిందో కాని...ఎట్టకేలకు పోలీసులకు వీరిపై అనుమానం వచ్చింది. దీంతో వీరిని గట్టిగా తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన దారుణం బైటకు వచ్చింది. సోమవారం నాడు చంద్రమాంపల్లి పాఠశాలకు సెలవు ప్రకటించి మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.నిందితులను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chikkadala Raja had an affair with a woman named Jyothi and had murdered her husband Sattibabu by hitting him with a hammer on last month 19 th in East Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more