విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

30వేల కోసం స్నేహితుడినే హత్య: చివరకు చిక్కారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అప్పు తీర్చమన్నందుకు ఏకంగా స్నేహితుడి ఉసురు తీసిన నలుగురు యువకులను దువ్వాడ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 28 వేలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ జోన్ డీసీపీ రాంగోపాల్ నాయక్ వివరాలను వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి నడుపూరు, మద్దివాని పాలెం గ్రామావల సరిహద్దులో గత నెల 9వ తేదీన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు.. జార్ఖండ్‌కు చెందిన క్లైమెంట్ ఎక్కా (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

30వేల కోసం స్నేహితుడి హత్య

30వేల కోసం స్నేహితుడి హత్య


కేసు నమోదు చేసి సౌత్ జోన్ ఏసీపీ మధుసూదనరావు, సీఐ వెంకటరావులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెదగంట్యాడ ఏపీ హెచ్‌బీ కాలనీలో నివసిస్తున్నాడు. పెదగంట్యాడ మండలం నమ్మిదొడ్డిలో ఉంటున్న మీసాల బబ్లుకుమార్ (జార్ఖండ్), ఉమేష్ బదయాక్‌లు వచ్చి ఎక్కాను నడుపూడి గ్రామ శివార్లకు తీసుకెళ్లారు.

30వేల కోసం స్నేహితుడి హత్య

30వేల కోసం స్నేహితుడి హత్య


అక్కడ ఎక్కా బబ్లుకుమార్‌తో మాట్లాడుతుండగా ఉమేష్ వెనక నుంచి బలమైన కర్రతో తలపై మోదాడు. దీంతో ఎక్కా కిందపడిపోగా మిగిలిన వారు అతని ముఖాన్ని రాళ్లతో చితక్కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.

30వేల కోసం స్నేహితుడి హత్య

30వేల కోసం స్నేహితుడి హత్య


మృతుడు క్లెమెంట్ ఎక్కా దగ్గర నుండి బబ్లుకుమార్ రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బు మాటిమాటికి అడుగుతుండటంతో ముందుగానే పథకం వేసుకున్నాడు. సొమ్ము తిరిగిస్తానని చెప్పి తీసుకెళ్లి మృతుని వద్దనుంచి అతని ఏటీఎం నెంబర్‌ను తెలుసుకున్నారు.

 30వేల కోసం స్నేహితుడి హత్య

30వేల కోసం స్నేహితుడి హత్య


హత్య చేసిన అనంతరం మృతుని వద్ద నుండి ఏటీఎం కార్డును తీసుకెళ్లిపోయారు. కూర్మన్నపాలెం, గాజువాక, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లోని ఎటీఎంల ద్వారా రూ. 79వేలు డ్రా చేశారు. మృతుని కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డు మిస్ అయిందని ఫిర్యాదు ఇవ్వండతో తమకు క్లూ దొరికిందని పోలీసులు తెలిపారు. ఏటీఎంలలో సీసీ పుటేజీలను పరిశీలించిన తర్వాత నిందితులను గుర్తించామన్నారు. నిందితుల్లో బబ్లుకుమార్, ఉమేశ్‌లు మృతునికి స్నేహితులే కాకా సమీప బంధువులు కావడం విశేషం.

English summary
man murdered for rs 30,000 in visakhapatnam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X