ఆన్‌లైన్‌లో ఫోన్ కి బదులు ఆ కష్టమరికి రాళ్లు వచ్చాయి

Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఈ కామెర్స్ వెబ్‌సైట్లు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ వస్తువు కావలన్నా ఇంట్లో నుంచే బుక్ చేసుకొనే సౌకర్యం ఉండటంతో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువుకి బదులు ఏ రాయో లేక సబ్బు బిల్లో వంటి వస్తువులు డెలివరీ అయిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి.

Man Orders Cell Phone Online, Gets Stone in Packet

తాజాగా గుంటూరుకు చెందిన వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఫోన్ బుక్ చేసిన సాయి అనే వ్యక్తికి ఫోన్ బదులు రాళ్లు డెలివరీ అయ్యాయి.

అమెజాన్‌లో రూ.15వేలు చెల్లించి సాయి వీవో వీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ బుక్ చేసుకొన్నారు. తీరా డెలివరీ జరిగిన తర్వాత పార్శిల్‌లో ఫోన్ బదులు రాళ్లు ఉండటం చూసి సాయి అవాక్కయ్యారు. ఈ ఘటనపై సాయి వినియోదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man who had ordered a cell phone from an online portal but he received stone in a package in Guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి