చాక్లెట్ ఆశ చూపి వారం పాటు బాలికపై అత్యాచారం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓ బాలికపై అత్యంత దారుణం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన 45 ఏళ్ల గిడుగు రాజు అనే్ వ్యక్తి ఆ బాలికపై దాష్టీకానికి ఒడిగట్టాడు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన సభ్యులు నగరం గ్రామంలో ఇటుక బట్టీల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కూతురు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పాఠశాల పక్కనే నివాసం ఉండే గిడుగు రాజు బాలికకు చాక్లెట్లు ఆశచూపి వారం రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. స్తానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

లారీ ఢీకొని యువకుడి మృతి
ఇదిలావుంటే, లారీ ఢీకొని ఓ యువకుడు మరణించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని లాలా చెరువు సమీపంలోని స్పిన్నింగ్ పిల్లు వద్ద బత్తిన గర్‌కు చెందిన సూరిబాబు (23) రోడ్డు పక్కన నడుస్తుండగా లారీ ఢీకొట్టింది. పైనుంచి లారీ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.












Click it and Unblock the Notifications