కిలాడీ లేడీలు: తోడుగా వచ్చి సినీ ఫక్కీలో దోచేశారు
విజయవాడ: ఓ యువకుడికి తోడుగా వచ్చిన మహిళా మిత్రులు చోరీకి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో సంచలనం సృష్టించింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీపై పోలీసులు నోరు విప్పడం లేదంటూ స్థానిక మీడియాలో వార్తలువచ్చాయి.
తనతో పాటు వచ్చిన ఇద్దరు యువతులు రూ.20 లక్షలు చోరీకి పాల్పడినట్లు బాదితుడు నివాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు యువతులతో కలిసి నివాస తన కారులో రైల్వే స్టేషన్‌కు బయలుదేరాడు.

విజయవాడలోని బెంజీ సర్కిల్‌లో గల ఓ హోటల్లో వీరంతా టిఫిన్ చేశారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లేసరికి నివాస్ వద్ద ఉన్న 20 లక్షలు మాయమయ్యాయి. దీంతో నివాస్ సూర్యారావుపేట పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
ఇద్దరు యువతులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారని సమాచారం. డబ్బు సంచీని బందరు కాల్వ వద్ద పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications