భార్య శవాన్ని వదిలేసి పరారీ, తొలి భార్య కూడా..

గత కొద్దికాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు సుధారాణిని వేధిస్తూ వచ్చారు. పుట్టింటివారికి చెప్పుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన సుధారాణి నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సోమవారం మృతదేహాన్ని కొట్టాలపల్లికి తరలిస్తుండగా అంబులెన్స్ కొండాపురం వద్దకు చేరుకోగానే రఘువీరప్రసాద్ డ్రైవర్‌ను కొట్టి పరారయ్యాడు.
దీంతో మృతదేహాన్ని తీసుకుని సుధారాణి తల్లి గ్రామానికి చేరుకుంది. అప్పటికే ఇంటికి తాళం వేసి ఉండడంతో మృతదేహాన్ని పోలీసుల సాయంతో అల్లుడి ఇంటి వద్ద ఉంచింది. విషయం తెలుసుకున్న సుధారాణి బంధువులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
రఘువీరప్రసాద్ పదేళ్ల క్రితం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం ఏరూరుకు చెందిన లలితను పెళ్లి చేసుకున్నాడు. కట్నం వేధింపులతో లలిత ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో భర్త పట్టించుకోకపోవడంతో లలిత మృదేహాన్ని పుట్టింటివారే ఖననం చేశారు. తిరిగి సుధారాణిని రఘువీరప్రసాద్ రెండవ పెళ్లి చేసుకున్నాడు. కట్నం కోసం వేధించడంతో సుధారాణి సైతం ఆత్మహత్య చేసుకుంది.
మృతదేహాన్ని అత్తింటివారు ఖననం చేసేంతవరకు కదిలేది లేదని సుధారాణి పుట్టింటివారు అక్కడే బైఠాయించారు. పుట్టింటివారు ముట్టకపోవడం, అత్తింటివారు పత్తాలేకపోవడంతో అంతా ఉన్నా సుధారాణి మృతదేహం అనాథగా పడిఉంది. దీంతో పోలీసులు మృతదేహానికి కాపలాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications