నీతూపై దాడికి యత్నం, సబ్ జైల్లోని లావాదేవీలవల్లే!
కర్నూలు: ఎర్రచందనం కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతూ అగర్వాల్ పైన నాగరాజు అనే వ్యక్తి దాడికి యత్నించాడు. ఎర్ర చందనం కేసులో బెయిల్ పై విడుదలైన నీతూ అగర్వాల్ కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వచ్చారు.
తిరిగి హైదరాబాద్ వెళుతుండగా నంద్యాల శివారులోని అయ్యలూరు మెట్ట సమీపంలో నాగరాజు అనే వ్యక్తి నీతూ అగర్వాల్‌పై దాడికి ప్రయత్నించాడు. నీతూ సబ్ జైలులో ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవల బెయిల్ పైన విడుదలైన నీతూ అగర్వాల్‌కు కోర్టు షరతులు విధించారు. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా దాడికి యత్నించారు.
నీతూ అగర్వాల్ సబ్ జైలులో ఉన్నప్పుడు ఆమె బట్టలను కూడా నాగరాజు ఉతికేవాడని తెలుస్తోంది. గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా ఉన్న నాగరాజు ఎర్ర చందనం స్మగ్లర్‌కు సహకరిస్తూ.. తమిళనాడు నుండి కూలీలను బస్సులో తీసుకు వచ్చేవాడు. ఈ క్రమంలో నాగరాజును సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications