తల్లీకూతుళ్లను లోబర్చుకున్నాడు.. ఆఖరికి మనవరాలిపై కూడా కన్నేశాడు: ఎట్టకేలకు..

గుంటూరు: వావి వరుసలు సైతం మరిచిపోయిన ఓ వ్యక్తి అత్యంత నీచానికి దిగజారాడు. నిండా కామంతో కళ్లు మూసుకుపోయి ఓ తల్లీకూతుళ్లను లోబర్చుకున్నాడు. ఆపై ఆమె మనవరాలిపై కూడా కన్నేసి ఆమెను లోబర్చుకునేందుకు విఫలయత్నం చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు అతని బాగోతం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళ్తే.. పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు చాలాకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమె కూతురిని కూడా లోబర్చుకున్నాడు. తల్లీకూతుళ్లతో లైంగిక కోర్కెలు తీర్చుకుంటూనే.. కూతురి కుమార్తె(మనవరాలు)పై కూడా కన్నేశాడు.

man who is having illicit affair with a woman was harassed her grand daughter

వివాహిత అయిన ఆమె భర్తతో విభేదాల కారణంగా ఇటీవల పుట్టింటికి వచ్చింది. అక్కడ నిత్యం నాగేశ్వరరావు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేయబోయాడు. అతడిని హెచ్చరించాల్సింది పోయి.. ఆమె అమ్మమ్మ, తల్లి కూడా అతనినే వెనుకేసుకొచ్చారు. దీంతో ఇంటి నుంచి పారిపోయిన బాధితురాలు.. గుంటూరులో ఉంటున్న తన స్నేహితురాలి వద్దకు చేరింది.

ఆమె సలహా మేరకు సోమవారం బాధితురాలు రూరల్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల సీఐను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+